అప్పుడప్పుడు మన కళ్ళు కూడ మనల్ని మోసం చేస్తాయన్నది పాత కాలం సామెత. దాన్ని బాగా వంటపట్టి౦చుకున్నకొన్ని న్యూస్ ఛానెళ్ల కారణంగా ఓటుకు నోటు కేసులో ఏది తప్పో ఏది ఒప్పో అన్నది అర్దం కాక జనాలు బాగా కన్ఫ్యూషన్లో పడ్డారు. కొన్ని చానెళ్లు డబ్బు ఇచ్చినోడిది తప్పు అన్నారు, వీటికి పోటీగా మరి కొన్ని చానెళ్లు డబ్బు ఇచ్చినోడిది కాదు ఇప్పించినోడిది తప్పు అని ప్రచారం చేశాయి. ఇంకా కొన్ని చానెళ్లు ఐతే ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి డబ్బు ఇచ్చినోడిది, ఇప్పించినోడిది ఇద్దరిది తప్పు కాదు, కావాలనే కేసులో ఇరికించారు, అసలు డబ్బు తీసుకున్నోడిదే తప్పు అని ప్రచారం చేశారు. మరి ఆడియో, వీడియో సాక్షాలు ఉన్నాయి కదా అంటే మళ్లీ అదే పాత కాలం సామెత(కళ్ళు, చెవులు మోసం చేస్తాయి) ని చూపించారు. జనాలు కూడా ఎవరికి కావల్సినట్టు వాళ్ళు అర్దం చేసుకొని ఆనందపడి అసలు విషయం మర్చిపోయారు.
మొదట్లో దూకుడుగానే సాగిన ఓటుకు నోటు కేసు విచారణ రాను రాను తెలుగు టీవీ సీరియల్లాగ స్లో అయ్యింది. సందట్లో సాడేమియ్యాలాగ డబ్బులిచ్చినోడు అదేదో ఘనకార్యం చేసినట్టు, బెయిలుపై బయటకి వచ్చి విజయయాత్రలు చేయడం. మల్లా ఇది తప్పు అని ఒకడు, ఒప్పు అని ఒకడు వాదించుకోవడం జరిగిపోయాయి. కేసుని అవకాశంగా మార్చుకొని, ఒక ప్రాంతంపై లేని అధికారాలు పొందాలని చూసిన వారి ఆశలు ఆడియాశలైనాయి. దోంగతనం చేసినోడే తిరిగి దొంగా అని అరిచినట్టు, అసలు దొంగలంతా కలిసి భాదిథుల మీద దొంగ కేసులు బనాయించారు. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ ఎక్కడో బల్బ్ వెలిగినట్టు, ఇక్కడ ప్రాణాలకు భయమ్మున్నదని అక్కడెక్కడ దొంగ కేసులు పెట్టిన, అర్దం పర్ద౦ లేని సంఘటనలతో అసలు కేసు మెయిన్ ట్రాక్ మారి సైడ్ ట్రాక్ ఎక్కింది.
అనుకున్నట్లు గానే నాలుగు రోజులు 40రోజులు అయ్యింది. జనాలు మార్చిపోతారేమో అని అప్పుడప్పుడు చిన్న ప్రోగ్రెస్ని చూపించడం తర్వాత మళ్లీ స్తబ్దత. నోటీస్లకు ప్రతి నోటీస్ల ఘట్టం రసవత్తరంగానే గడిచిన దాని వల్ల సాదించి౦ది శూన్యం. ఇప్పుడు ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు అసలు నిందితులని వదిలేసి కార్ డ్రైవర్లని, ఇంట్లో పనోళ్లని, గన్మేన్లను విచారించే దశకి చేరింది.
నిజానికి ఒక దొంగని, దొంగా అని ప్రూవ్ చేయాలంటే ఇంత కస్టామా? అని ఓటుకు నోటు కేసుని చూస్తే అర్దం అవుతుంది. ఈ కేసు చివరకి ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియదు గాని ఫలితాన్ని మాత్రం మన చానెళ్లు ఎవరికి కావాల్సిన విదంగా వాళ్ళు మార్చుకుంటారు అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.
(Visited 107 times, 1 visits today)