Home / Inspiring Stories / గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సృష్టించిన వరంగల్ అమ్మాయిలు..!

గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సృష్టించిన వరంగల్ అమ్మాయిలు..!

Author:

కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు (వరంగల్) పట్టణంలో కాకతీయుల వీర వనిత రుద్రమదేవి పోరాట స్పూర్తితో వరంగల్ అమ్మాయిలు గిన్నిస్ రికార్డు సృష్టించారు, ఒకే సమయంలో దాదాపు 22 వేల మంది అమ్మాయిలకి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణని ఇచ్చి గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు వరంగల్ పోలీసులు, అమ్మాయిలలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ ఉమెన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

warangal-girls-created-gunnies-record

వరంగల్ లో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ ముఖ్య అతిధిగా హాజరయ్యారు, 21762 మంది మహిళలు, యువతులు 51 నిమిషాల 32 సెకండ్లపాటు ట్రైనర్స్ గైడ్ లైన్స్ తో మార్షల్ ఆర్ట్స్ సాధన చేసి ఒకే వేదిక నుంచి రుద్రమదేవి సాక్షిగా మహిళాశక్తిని చాటారు. గతంలో 2272 మంది బ్రెజిల్ అమ్మాయిల పేరిట గిన్నిస్ బుక్ రికార్డు ఉంది, వరంగల్ పోలీసులు 3 వేల మంది అమ్మాయిలతో కార్యక్రమం చేయించి ఆ రికార్డు బ్రేక్ చేద్దాం అనుకోని రిజిష్ట్రేషన్లు మొదలుపెడితే 27 వేల మంది అమ్మాయిలు రిజిస్టర్ చేయించుకున్నారు, ఈవెంట్ లో 21 వేల 762 మంది పాల్గొని బ్రెజిల్ అమ్మాయిల పేరిట ఉన్న గిన్నిస్ రికార్డుని తిరగరాశారు, కార్యక్రమం కోసం జిల్లా పోలీసులు,కలెక్టర్ సమన్వయంతో పని చేసి ఈవెంట్ ని విజయవంతంగా ఆర్గనైజ్ చేసారు.

(Visited 331 times, 1 visits today)