Home / health / హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?

హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?

Author:

ప్రాణాపాయ ప‌రిస్థితిలో ఆస్ప‌త్రిలో చేరిన వారిని లేదా ఆప‌రేష‌న్ చేయ‌బ‌డిన వారిని సాధారణంగా హాస్పిట‌ల్స్‌లో ఐసీయూలో చేరుస్తారు. దీంతో వారికి మెరుగైన చికిత్స అందుతుంది. వారిపై నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంది. ఈ క్రమంలో వారి ప్రాణాలు పోకుండా కాపాడ‌వ‌చ్చు. అయితే అలాంటి స్థితిలో ఉన్న పేషెంట్ల‌కు సాధార‌ణంగానే వారి హార్ట్ బీట్‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించేందుకు వారి బెడ్ ప‌క్క‌నే ఓ మెషిన్‌ను అమ‌రుస్తారు. చాలా సంద‌ర్భాల్లో మ‌నం దీన్ని చూసి ఉంటాం. అయితే ఆ మెషిన్‌ను ఏమంటారో, అది ఎలా ప‌నిచేస్తుందో, అందులో రీడింగ్స్‌ను ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హాస్పిట‌ల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉండే హార్ట్ బీట్ మెషిన్‌ను ఎల‌క్ట్రో కార్డియోగ్రాఫిక్ హార్ట్ మానిట‌ర్ అని పిలుస్తారు. ఇందులో ఆక్సీమీట‌ర్ కూడా ఉంటుంది. అయితే ఈ మానిట‌ర్ ద్వారా మ‌న‌కు క‌నిపించే రీడింగ్స్‌ను ఎల‌క్ట్రో కార్డియోగ్రామ్ అని పిలుస్తారు. ఇక ఈ మానిట‌ర్‌లో పై భాగంలో (80) చూపించేది హార్ట్ రేట్‌.

What do all the numbers on the monitor mean

సాధార‌ణంగా ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తుల‌కు అయితే ఈ హార్ట్ రేట్ 60 నుంచి 100 మ‌ధ్య‌లో ఉంటుంది. 100 దాటి హార్ట్ రేట్ ఉంటే ఆ రోగి హార్ట్ స‌మ‌స్య‌లో ఉంద‌ని అర్థం చేసుకోవాలి. గుండె జ‌బ్బు ఉంటే హార్ట్ రేట్ 100 క‌న్నా ఎక్కువ‌గానే ఉంటుంది.ఇక ఎల‌క్ట్రో కార్డియో గ్రాఫిక్ హార్ట్‌ మానిట‌ర్‌లో మ‌న‌కు హార్ట్ రేట్ కింద క‌నిపించే మ‌రో రీడింగ్ (119/79) ఏమిటంటే.. బ్ల‌డ్ ప్రెష‌ర్‌. అంటే బీపీ.. ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తికి ఇది 120/80 లేదా 110/90 ఉంటుంది. అలా కాకుండా గుండె జ‌బ్బు లేదా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి అయితే బీపీ రేట్ మారుతుంది. ఇక దాని కింద ఉండే రీడింగ్ (29/14) ను ప‌ల్మ‌న‌రీ ఆర్ట‌రీ ప్రెష‌ర్ (పీఏపీ) అని పిలుస్తారు. అంటే ఊపిరితిత్తుల‌కు వెళ్లే ర‌క్త నాళాల్లో ఉండే ఒత్తిడి అన్న‌మాట‌. ఇక దాని కింద ఉండే రీడింగ్ (97) ను ఆక్సీమీట‌ర్ ద్వారా కొలుస్తారు.

ఆ రీడింగ్‌ను ఎస్‌పీవో2 రీడింగ్ అంటారు. అంటే ర‌క్తంలో ఉన్న ఆక్సిజ‌న్ శాతం అన్నమాట‌. ఇక చివ‌ర్లో ఉన్న రీడింగ్ (40)ను శ్వాస‌క్రియ రేటు అంటారు. అంటే రోగి 60 సెక‌న్ల‌లో తీసుకున్న శ్వాస‌ల‌ సంఖ్య అన్నమాట‌. అంటే 60 సెక‌న్ల టైంలో రోగి 40 సార్లు గాలి పీల్చుకున్నాడ‌ని అర్థం.ఇక స‌ద‌రు మానిట‌ర్లు ఎప్పుడూ పెద్ద‌గా బీప్ అని శ‌బ్దం చేస్తుంటాయి క‌దా. అది ఎందుకంటే.. ఒక వేళ రోగి రీడింగ్ అసాధార‌ణ స్థితిలో ఉంటే బీపింగ్ వేగంగా ఉంటుంది. దీంతో ఆ శ‌బ్దాన్ని గ‌మ‌నించే వైద్యులు వెంట‌నే రోగికి చికిత్స అందించి ప్రాణాపాయం లేకుండా చూస్తారు. అందుక‌నే ఆ మెషిన్లు పెద్ద పెద్ద‌గా బీప్ చేస్తుంటాయి. అలాగే ఆ మానిట‌ర్‌లో పైకి కింద‌కు త‌రంగాలు వ‌స్తుంటే రోగి సేఫ్‌గా ఉన్నాడ‌ని అలా కాకుండా ఆ గీత‌లు మొత్తం ఫ్లాట్ లైన్‌గా వ‌స్తుంటే ఆ రోగి చ‌నిపోయాడ‌ని, లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడ‌ని తెలుస్తుంది. కాబట్టి తెలిసిందిగా.. ఆ మీట‌ర్ గురించి..!

(Visited 1 times, 1 visits today)