నకిలీ వార్తలు ప్రచారాలు చేయడానికి వాట్సాప్‌ను దుర్వినియోగపరుస్తున్నట్లు ఆరోపణలు రావడంతో భారత ప్రభుత్వం స్పందించింది. ఫిర్యాదుల పరిష్కారానికి, వదంతులను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని వాట్సాప్‌ను కోరింది. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ వెబ్‌సైట్‌ను ‘గ్రీవియెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా’తో అప్‌డేట్ చేశారు. యూజర్లు మొబైల్ యాప్ / ఈ-మెయిల్ / గ్రీవియెన్స్ ఆఫీసర్ కోమల్ లాహిరికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం ద్వారా సహాయం పొందవచ్చునని వాట్సాప్ తెలిపింది. లింకెడిన్ ప్రొఫైల్ ప్రకారం కోమల్ లాహిరి వాట్సాప్ గ్లోబల్ కస్టమర్ ఆపరేషన్స్ అండ్ లోకలైజేషన్ సీనియర్ డైరెక్టర్‌గా ఉన్నారు.
వాట్సాప్ అధికార ప్రతినిథిని సంప్రదించినపుడు ఈ విషయంపై వివరాలను తెలిపేందుకు అంగీకరించలేదు. కంపెనీ వెబ్‌సైట్‌లోని ఎఫ్ఏక్యూలను పరిశీలించాలని, ఈ వివరాలన్నీ దానిలో ఉన్నాయని మాత్రమే చెప్పారు.
గ్రీవియెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా కోమల్ లాహిరి అమెరికాలోనే ఉంటారని తెలుస్తోంది. అమెరికన్ టెక్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాల ప్రకారమే ఈ అధికారి పని చేయబోతున్నట్లు సమాచారం.
వాట్సాప్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యూజర్లు ఈ యాప్‌లోని ‘సెట్టింగ్స్’ ట్యాబ్ క్రిందనున్న ఆప్షన్ ద్వారా కంపెనీ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు. ఒకవేళ ఫిర్యాదు చేయాలనుకుంటే నేరుగా గ్రీవియెన్స్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చు.