Home / Political / వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారం పంపితే … గ్రూప్ అడ్మిన్ లు జైలుకే

వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారం పంపితే … గ్రూప్ అడ్మిన్ లు జైలుకే

Author:

మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా అందరికి అందుబాటులోకి వచ్చింది. పల్లెటూరి నుండి పట్నం వరకు అందరూ తమ ఫోన్లలో వాట్సాప్, ఫేస్ బుక్ యాప్స్ వాడుతున్నారు. సమాచారన్ని వేగంగా చేరవేసే ఈ ఇన్ స్టాంట్ మెసేజింగ్ యాప్ ల ద్వారా నిజమైన సమాచారం ఎంత వేగంగా ఇతరులకు చేరుతుందో అంతే వేగంగా తప్పుడు సమాచారం కూడా అందరికి చేరుతుంది. ఇలా తప్పుడు సమాచారం, వదంతులు, అసభ్యకరమైన పోస్టులు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇతరులకు పంపితే ఆ గ్రూప్ అడ్మిన్ ను అరెస్ట్ చేసి లోపలేస్తామని తెలిపారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.

whatsapp admin to go to jail

తెలిసిన వ్యక్తులు, బంధువులు, స్నేహితుల మధ్య అభిప్రాయాలు, ఫోటోలు, నచ్చిన వీడియోలు షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియా వెబ్ సైట్ లు, వాట్సప్ లాంటి యాప్స్ వచ్చాయి కాని వీటి ద్వారా మంచి కన్నా, చెడే ఎక్కువగా జరుగుతోందని వాదిస్తున్నారు పోలీసులు. ఇకనుండి ఏ వాట్సాప్ గ్రూపులో అయినా తప్పుడు సమాచారం పంపుతున్నారని ఎవరైన తమకు ఫిర్యాదు చేస్తే ఆ గ్రూపు అడ్మిన్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తామని, గ్రూప్ లో సభ్యులను చేర్చడమే కాకుండా.. పోస్టు అయ్యే ప్రతి పోస్ట్ పై అడ్మిన్ లు ఓ కన్నేసి ఉంచాలని లేకపోతే గ్రూప్ సభ్యులు చేసే అనవసరమైన పోస్టింగ్ లకు అడ్మిన్ లే బాధ్యులు అవుతారన్నారు పోలీసులు. గ్రూపు లో ఫోటో మార్ఫింగ్, అశ్లీల వీడియోలు పోస్ట్ చేసే వారిని వెంతనే తొలగించాలని తెలిపారు. గ్రూప్ అడ్మిన్ లు ఇకనుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి.

(Visited 423 times, 1 visits today)