Home / Latest Alajadi / వాట్సాప్ లో మరో మూడు సరికొత్త ఫీచర్లు…!

వాట్సాప్ లో మరో మూడు సరికొత్త ఫీచర్లు…!

Author:

ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉన్నది. ఇప్పటికే వాయిస్‌ కాలింగ్‌, వీడియో కాలింగ్‌, స్టేటస్‌ ఫీచర్లు ఉన్న యాప్‌లో కొద్ది రోజుల క్రితం మెసేజ్ డిలీట్‌ ఆప్షన్‌ కూడా వచ్చింది. ఇప్పుడు మరో మూడు ఫీచర్లని యూజర్ల కోసం ప్రవేశ పెట్టనుంది,వాటిలో ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌, షేక్‌ టు రిపోర్ట్‌, ప్రైవేట్‌ రిప్లైస్‌ ఫీచర్లు ఉన్నాయి.

whatsapp-introducing-new-features

ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌.

ప్రస్తుతం వాట్సాప్‌ లో ఎవరినైనా బ్లాక్‌ చేయాలంటే సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి బ్లాక్‌ చేయాలి. ఆ తర్వాత ఆ నెంబర్‌ను అన్‌బ్లాక్‌ చేయాలంటే.. మళ్లీ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి అన్ బ్లాక్ చెయ్యాలి కానీ ఈ ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌ ఫీచర్ తో కేవలం నెంబర్‌పై లాంగ్ ప్రెస్‌ చేస్తే అన్‌బ్లాక్‌ అవుతుంది.

షేక్‌ టు రిపోర్ట్‌.

వాట్సాప్‌లో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే …ఒక్కోసారి మెసేజ్‌లు వెళ్లవు.. రావు. వాటి గురించి మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారికి ఇన్ఫాం చేయాలంటే.. జస్ట్‌ మన ఫోన్‌ని షేక్‌ చేస్తే చాలు. కాంటాక్ట్‌ లిస్ట్‌ ఓపెన్‌ కావడంతో పాటు .. ఓ ఆప్షన్‌ వస్తుంది. అందులో ఆ ప్రాబ్లెమ్ ఏంటో వివరించి అందరికీ ఒకేసారి పోస్ట్‌ చేయొచ్చు.

ప్రైవేట్‌ రిప్లైస్‌.

వాట్సాప్‌లో మనం గ్రూప్‌ మెసేజ్‌లు చేస్తుంటాం. గ్రూప్‌లో ఉన్న వారు ఏ మెసేజ్‌ చేసినా అది గ్రూప్ లో ఉన్న అందరికీ వెళుతుంది. ఒక్కరికే మెసేజ్‌ పంపాలంటే వేరుగా కాంటాక్ట్‌ ఓపెన్‌ చేసి మెసేజ్‌ పంపాలి. అలా కాకుండా గ్రూప్‌లోనే ఉండి మనం మెసేజ్‌ పంపాలనుకునే వ్యక్తికి ప్రైవేట్‌గానే మెసేజ్‌ పంపొచ్చు. మెసేజ్‌ టైప్‌ చేసి సెట్టింగ్స్‌లో ఉండే ప్రైవేట్‌ రిప్లై ఆప్షన్‌ నొక్కితే చాలు ఆ వ్యక్తికే మెసేజ్ వెళ్తుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బేటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి,త్వరలో అందరికి అందుబాటులోకి రానున్నాయి..!

(Visited 320 times, 1 visits today)