Home / General / డిసెంబర్ 31 నుండి…ఈ ఫోన్ లలో వాట్సప్ పనిచేయదు..!

డిసెంబర్ 31 నుండి…ఈ ఫోన్ లలో వాట్సప్ పనిచేయదు..!

Author:

కొత్త సంవత్సరం వస్తుంది అని కంపెనీలన్ని రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటే ప్రపంచంలోనే ఎక్కువమంది యూజర్లని కలిగి ఉన్న సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్ కంపెనీ మాత్రం డిసెంబర్ 31 నుండి వాట్సాప్ సేవలు నిలిపి వేస్తున్నట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం కొన్ని రకాల స్మార్ట్ ఫోన్ లేక్ వర్తిస్తుందని ప్రకటించింది.

ప్రస్తుతం ఉన్న వాట్సప్ సాఫ్ట్ వేర్ పని చేసే విధంగా కొన్ని మొబైల్ ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్స్ (OS) లేవని, ఈ సాఫ్ట్ వేర్ లకి సంబంధించి ఆ కంపెనీలు భవిష్యత్ లో ఎలాంటి అప్‌డేట్స్‌ అభివృద్ధి చేయడం లేదని కావున డిసెంబర్ 31 నుండి ఆయా OS ఉన్న ఫోన్ లలో వాట్సప్ సేవలు నిలిపి వేస్తున్నట్లు వాట్సప్ సంస్థ అధికారంగా తన బ్లాగ్ లో తెలిపింది.

ఈ ఫోన్లలో వాట్సప్ బంద్

విండోస్ వెర్షన్ 80 , బ్లాక్ బెర్రీ 10, బ్లాక్ బెర్రీ ఓస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తున్న మొబైల్ ఫోన్ లలో వాట్సాప్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి, వీటిలో ఎటువంటి సాఫ్ట్ వేర్ అప్ డేట్ లు లేవని అందుకే పూర్తిగా నిలిపివేస్తున్నాం అని..ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు వెంటనే కొత్త ఓఎస్‌ వెర్షన్‌ (ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ 4.0+, ఐఫోన్‌ ఓఎస్‌ 7+, విండోస్‌ ఫోన్‌ 8.1+) లోకి అప్‌గ్రేడ్‌ కావాలని సూచించారు కంపెనీ నిర్వాహకులు. అప్పుడే వాట్సప్‌ను వినియోగించుకునే అవకాశముందని తెలిపారు.వీటితో పాటు నోకియా ఎస్‌ 40 ఫోన్లలో వాట్సాప్‌ డిసెంబర్‌ 31,2018 తర్వాత పనిచేయదని తెలిపింది. ఫిబ్రవరి 1, 2020 తర్వాత ఆండ్రాయిడ్‌ 2.3.7 , అంతకంటే పాత వెర్షన్‌లలో కూడా వాట్సాప్‌ సేవలను నిలిపి వేయనుంది.ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ మొబైల్ ఫోన్ లలో వాడుతున్న వాళ్ళు తరువాత వెర్షన్ కి అప్ డేట్ చేసుకుంటేనే డిసెంబర్ 31 తరువాత వాట్సాప్ సేవలు పనిచేస్తాయి.

(Visited 629 times, 1 visits today)