Home / health / కోడిగుడ్ల‌ తెలుపు లేదా గోధుమ‌.. రెండింటిలో ఏ రంగు గుడ్ల‌ను తింటే మంచిదో తెలుసా..?

కోడిగుడ్ల‌ తెలుపు లేదా గోధుమ‌.. రెండింటిలో ఏ రంగు గుడ్ల‌ను తింటే మంచిదో తెలుసా..?

Author:

కోడిగుడ్ల‌తో మ‌న శరీరానికి కావ‌ల్సిన ముఖ్య పోష‌కాలు అందుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ధానంగా వాటిలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు మ‌న‌కు ఎంతో అవ‌స‌రం. అవి శ‌రీర నిర్మాణానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కోడిగుడ్ల‌లో ఉండే కాల్షియం ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తుంది. అయితే మ‌న‌కు మార్కెట్‌లో కొన్ని చోట్ల గోధుమ రంగు గుడ్లు కూడా క‌నిపిస్తాయి. అవును, మీరు కొన్ని చోట్ల వాటిని చూసి ఉంటారు క‌దా. నాటుకోళ్లు అయితే అవి పెట్టే గుడ్లు అలా ఉంటాయి. అయితే మ‌రి సాధార‌ణంగా మ‌నం తినే కోడిగుడ్లు మాత్రం తెలుపు రంగులో ఉంటాయి. మ‌రి కోడిగుడ్ల‌లో ఈ తేడాలెందుకు..? ఎలాంటి రంగు ఉన్న కోడిగుడ్ల‌ను తింటే ఏమేం లాభాలు క‌లుగుతాయి..? ఆరోగ్యం కోసం ఏ గుడ్ల‌ను తింటే మంచిది.? అంటే అవును, ఆ వివ‌రాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం.

1. గోధుమ రంగులో ఉండే గుడ్లు సాధార‌ణ గుడ్ల క‌న్నా కొంచెం ధ‌ర ఎక్కువ‌గానే ఉంటాయి.

2. కోడిగుడ్లు సాధార‌ణంగా తెలుపు రంగులోనే ఉంటాయి. అయితే వాటికి పెట్టే తిండి కార‌ణంగా గుడ్ల రంగు మారుతుంది. ఎక్కువ‌గా మొక్క‌జొన్న సంబంధిత ఆహారం పెడితే కోళ్లు పెట్టే గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. అందుకే ఆ గుడ్ల‌లో ఉండే ప‌చ్చ‌సొన కూడా బాగా చిక్క‌గా ఉంటుంది.రుచి విష‌యానికి వ‌స్తే తెలుపు క‌న్నా గోధుమ రంగు గుడ్లే ఎక్కువ రుచిగా ఉంటాయి.

white-or-brown-which-color-eggs-are-best-to-us

3. ఇక పోష‌కాల విష‌యానికి వ‌స్తే గోధుమ రంగు గుడ్ల‌లోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. సాధార‌ణ గుడ్ల‌లో క‌న్నా కొన్ని రెట్లు ఎక్కువ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గోధుమ రంగు గుడ్ల‌లో ఉంటాయి. క‌నుక తెలుపు రంగు గుడ్ల క‌న్నా గోధుమ రంగు గుడ్లే బెట‌ర్‌.

4. ఇన్ని లాభాలు ఉంటాయి కాబ‌ట్టే నాటు కోళ్లు పెట్టిన గుడ్ల‌ను చాలా మంది తింటారు. అయితే నాటు కోళ్లు మాత్ర‌మే కాదు, ఇత‌ర కోళ్లు కూడా గోధుమ రంగు గుడ్లు పెడ‌తాయి. కానీ వాటికి పైన చెప్పిన విధంగా ఆహారం పెడితేనే అది సాధ్య‌మ‌వుతుంది. అలా పెట్టి గోధుమ రంగు గుడ్లను ఉత్ప‌త్తి చేసి సూప‌ర్ మార్కెట్ల‌లో విక్ర‌యిస్తున్నారు కూడా.

క‌నుక ఈ సారి మార్కెట్‌కు వెళితే ఓ సారి గోధుమ రంగు గుడ్ల‌ను ట్రై చేయండి. వాటి టేస్ట్ చూశాక అప్పుడు మీరే డిసైడ్ అవ్వండి. ఏ రంగు గుడ్ల‌ను తినాలో..!

(Visited 1 times, 1 visits today)