Home / Inspiring Stories / అతను గొప్ప చదువులు చదివి 50 కార్లకు ఓనర్ గా ఉండి, మైసూరులో రెండు స్ట్రాబెర్రీ తోటలు కొని డ్రైవర్ గా పని చేరుస్తున్నాడు ఎందుకు.!?

అతను గొప్ప చదువులు చదివి 50 కార్లకు ఓనర్ గా ఉండి, మైసూరులో రెండు స్ట్రాబెర్రీ తోటలు కొని డ్రైవర్ గా పని చేరుస్తున్నాడు ఎందుకు.!?

Author:

మనం ఏదైనా మంచి జీవితగాధ విన్నప్పుడు కలిగే ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తూ మనసుకు ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు  చదువబోతున్న కథ  కాదు నిజంగా జరిగిన సంఘటన మీ కోసం….

శ్రీకాంత్ సింగ్  ఒక రోజు ఆఫీస్ నుండి ఇంటికి  వస్తున్న సమయంలో  ఉబెర్ క్యాబ్ ఎక్కాడు. అలా ఎక్కిన శ్రీకాంత్ మాటల మధ్యలో డ్రైవర్ తో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ డ్రైవర్ పేరు ఆనంద్.  శ్రీకాంత్ అడిగినదానికి సమాధానంగా అనర్గళంగా ఇంగ్లీష్ లో సమాధానం ఇస్తున్నాడు. ఇలా కొద్దీ సేపు గమనించిన శ్రీకాంత్ ఉండబట్టలేక సార్ మీరు నాకో నిజం చెప్పాలి!, అడగమంటారా! అని తనకు సంబంధం లేకుండానే పిలుపులో మర్యాదగా ఆ డ్రైవర్ ఆనంద్ ని అడిగాడు. ఆ డ్రైవర్ కూడా అడగామిని చెప్పడంతో శ్రీకాంత్ అడగడం మొదలు పెట్టాడు…

శ్రీకాంత్ : సార్ మీరు నిజంగానే కార్ డ్రైవరా!, మీరు ఇంత అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మీరు నిజం చెప్పండి సారు. ఇంతకు మీకు కారు నడపవలసిన అవసరం ఏంటి !?.

Why 50 Car owner become a cab driver

ఆనంద్ : నేను ఐఐటీ ఖరగ్ పూర్ లో 1986 లో గ్రాడ్యుయేషన్ చేశాను, గత ముప్పై ఏళ్లుగా విదేశాలు తిరిగి నాకంటూ కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాను. అంతేకాకుండా నాకు  50కార్లు ఉన్నాయి …. వాటిని ఉబెర్ తో లింక్ చేశా! …. అంతే కాకుండా నాకు మైసూరు దగ్గర రెండు స్ట్రాబెర్రీ తోటలు  కూడా  ఉన్నాయి.

శ్రీకాంత్ : మరి ఇంత ఆస్తి ఉంది మీరెందుకు డ్రైవర్ హెగా పని చేస్తున్నారు.

ఆనంద్ : నేను కార్ నడపటానికి కారణం నా దగ్గర పనిచేస్తున్న ఒక డ్రైవర్ ఇటీవల ప్రమాదంలో చనిపోయాడు. దానితో వారి కుటుంబానికి నేను డబ్బు ఇవ్వడానికి సిద్ధం అయ్యాను కానీ వారు డబ్బును తీసుకోలేదు. అందుకే నేను చనిపోయిన అతని స్థానంలో అదే కారును నడుపుతూ వచ్చిన డబ్బుని అతని కుటుంబానికి ఇవ్వాలి అనుకుంటున్న… నాకు ఇందులో ఆనందం ఉంది అందుకే డ్రైవర్గా చేస్తున్నా ….

ఇదే విషయం…   నాకు స్ఫూర్తినించిన వ్యాక్తి ఆనంద్ సార్ అంటూ  బెంగుళూరు కు చెందిన శ్రీకాంత్ సింగ్ ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అతను చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. అతను తన ఫేస్ బుక్ అకౌంట్ లో ‘నా జీవితంలో నేను కలిసిన అత్యంత స్పూర్థినిచ్చిన వ్యక్తి’ ఇతనే అని పోస్ట్ చేసాడు.
అయిన అతను తలుచుకుంటే కొన్ని నిమిషాలలో వారిని ఒప్పించి  లేదా ఏదో ఒక రూపంలో  వారికి డబ్బులు ఇవ్వగలడు కానీ తానే స్వయంగా కష్టపడి ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది…. అని ఇప్పుడు ఈ పోస్ట్ చదివిన వారు అందరూ ఆనంద్ గారిని మెచ్చుకుంటున్నారు.
ఎంతైనా ఆనంద్ గారు మీరు చాలా గ్రేట్….  మీకు ఇదే మా  సెల్యూట్….

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)