Home / Devotional / హిందువులకు అంతమంది దేవుళ్ళు ఎందుకు ఉంటారు! అని ఎగతాళి చేసేవారికి సమాధానం ఇది…

హిందువులకు అంతమంది దేవుళ్ళు ఎందుకు ఉంటారు! అని ఎగతాళి చేసేవారికి సమాధానం ఇది…

Author:

ప్రపంచంలో ఎక్కడలేని సర్వమత సమ్మేళనం ఒక్క భారతదేశంలోనే ఉంది. ఈ మధ్య మా మతం గొప్పది అంటే మా మతం గొప్పది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అన్నిమతాలలో ఒకే దేవున్నిపూజిస్తారు.ఒక్క హిందువులు మాత్రం ఎక్కువ దేవుళ్లను పూజిస్తారు. ఈ విషయంపై స్పదించిన నానాపటేకర్ ఈ విధంగా చెప్పుకొచ్చారు ….
ఒక సమయంలో ఆంగ్లేయుడు సత్య అన్వేషణ కోసం భారతదేశం వచ్చి అన్ని గ్రంధాలను శోధించారు ఆయన స్వయానా క్రిష్టియన్ . అన్ని గ్రంధాలను శోధించి చివరకు రామాయణం, మాహాభాగవతం,పురాణాలూ , వేదాలు,ఉపనిషత్తులు చదివి ఎన్నో ఏళ్ల నుండి వెతికిన సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మంలో దొరికింది అతనికి….
hindu-gods
హిందూ దేవుళ్లలో అంతమంది ఎందుకు ఉంటారు అన్న సమాధానానికి ఈ విధంగా తెలియజేసారు…..
తల్లి తన బిడ్డకు ఆకలి వేసినప్పుడు గరిటపట్టుకొని అన్నపూర్ణగా మారుతుంది. పిల్లలు చదువుకుంటున్న సమయంలో అమ్మ నాకు ఈ లెక్క అర్ధం అవ్వడం లేదు అంటే వెంటనే సరస్వతీదేవిగా మారి ఈ విధంగా చేయాలి అని చెబుతుంది..అమ్మ ఖర్చులకి డబ్బులు కావలి అంటే వెంటనే లక్ష్మి దేవిగా మారుతుంది. పిల్లలు తప్పు చేస్తే దండించే ఆదిపరాశక్తిగా మారుతుంది. ఇలా ఎదురుగా ఉన్న తల్లి అనేక రూపాలలో కనిపిస్తుంటే, ఈ సృష్టిని చేసిన దేవుడు తన పిల్లల అవసరాల కోసం ఎన్ని అవతారలైన దరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇంత మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు.
హిందూ ధర్మంలో ఏమిలేదు అనుకునేవారికి సరిగ్గా అర్ధం చేసుకుంటే ఫలితం తెలుస్తోంది… అది ఎలా అంటే …. మంచు చూడటానికి మనకి ఒకే విధంగా కనిపిస్తుంది కానీ మంచులో నివసించేవారు మంచులో 42 రకాలు ఉంటాయి అంటారు. కానీ దూరం నుండి చుస్తే వారికి ఒకేలా కనిపించిన దగ్గరికి వెళ్లి చుస్తే అసలు విషయం తెలుస్తోంది అని చెప్పాడు.
ఈ విషయం బయట వారికి కాదు హిందువులలో ఉండి హిందూ మతాన్ని సరిగ్గా అర్ధం కానీ వారికి కూడా వర్తిస్తుంది.మన మతాన్ని సరిగ్గా అర్ధం చేసుకొని కాపాడే బాధ్యత మన అందరిదీ అన్నారు…..

(Visited 3,744 times, 1 visits today)