సాధారణంగా భూమి చుట్టూ జరిగే ఒక చంద్ర పరిభ్రమణానికి 28 రోజుల పడుతుంది. అయితే చంద్ర గ్రహణం సమయంలో, ఒక పూర్తి చంద్ర పరిభ్రమణ సమయంలో (28 రోజులలో) ఏమి జరుగుతుందో అది కేవలం ఒక రెండు, మూడు గంటల్లోనే సూక్ష్మ రూపంలో జరుగుతుంది. శక్తిపరంగా చూస్తే, భూమి యొక్క శక్తి ఈ గ్రహణాన్ని ఒక పూర్తి చంద్ర పరిభ్రమణంగా భ్రమ పడుతుంది. దీని వల్ల భూమిపై కొన్ని నిర్దిష్టమైన మార్పులు జరుగుతాయి. అందువల్ల ఏదైనా పదార్ధం దాని సహజ స్థితిలో లేకుండా ఉంటే, అది చాలా త్వరగా పాడైపోతుంది. అందువల్లే పచ్చి కూరగాయలు, పండ్లలో ఎటువంటి మార్పు ఉండకపోయినా, వండిన ఆహార పదార్ధాలలో గ్రహణం ముందు, ఆ తరువాత స్పష్టమైన మార్పు ఉంటుంది. ఏది పౌష్టికమైన ఆహారమో అదే విషంగా మారుతుంది.
ఏదైతే మీ ఎరుక(awareness)ను తగ్గిస్తుందో అదే విషం. అది మీ ఎరుకను కొంత వరకు తగ్గిస్తే, మీలో చురుకుదనం తగ్గుతుంది. ఇంకొంత తగ్గిస్తే, మీరు నిద్రపోతారు. మీ ఎరుకను పూర్తిగా తగ్గిస్తే, మీరు మరణిస్తారు. మందకొండిగా ఉండడం, నిద్ర, మరణం – ఇది కేవలం ఒక పరిణామ క్రమం మాత్రమే. అందువల్ల వండిన ఆహరం ఒక సాధారణ రోజు కంటే చంద్ర గ్రహణ సమయంలో ఓ సూక్షమైన విధానంలో క్షీణించే దశల గుండా మరింత వేగంగా వెళ్తుంది.
చంద్ర గ్రహణం సమయంలో ఆహారం మీ శరీరంలో ఉంటే, రెండు గంటల సమయంలోనే మీ శక్తుల ప్రకారం సుమారు ఇరవై ఎనిమిది రోజుల సమయం అయిపోతుంది. అంటే అటువంటి రోజున పచనం చేయని (వండని) ఆహరం తినవచ్చా? లేదు, ఎందుకంటే ఆహరం మీ శరీరంలోకి వెళ్ళగానే, మీ జీర్ణాశయంలోని రసాలు దానిపై దాడి చేసి, చంపేస్తాయి. అప్పుడు అది సగం వండిన ఆహార పదార్ధంగా మారిపోతుంది, దానిపై కూడా అదే ప్రభావం ఉంటుంది.<\p>
ఇది కేవలం ఆహరం గురించే కాదు. ఇది మీరు ఏ విధంగా ఉన్నారో దాని గురించి. మీరు ఏదో ఒక విధంగా మీ సహజ స్థితి నుంచి దూరంగా వెళ్తే, ఈ శక్తులకు ఎక్కువ అందుబాటులో ఉంటారు. అంటే వీటి ప్రభావం మీపై చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మీరు మీ సహజ స్థితిలో ఉంటే, ఈ శక్తులకు అతి తక్కువగా అందుబాటులో ఉంటారు. అంటే వీటి ప్రభావం మీపై చాలా తక్కువగా ఉంటుంది.
చంద్ర పరిభ్రమణం మానవ వ్యవస్థ మీద శారీరకంగా, మానసికంగా, శక్తిపరంగా ప్రభావం చూపుతుంది. ఇది మన తల్లుల ఋతు క్రమంలో స్పష్టంగా తెలుస్తుంది. నేను మన తల్లుల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన తల్లులు చంద్రుడితో లయబద్ధంగా ఉన్నందువల్లే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము. ఒకవేళ మన తల్లుల శరీరాలు చంద్రుడితో లయబద్ధంగా లేకపోతే, ఈ రోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. చంద్ర పరిభ్రమణం రెండు, మూడు గంటల సమయంలో ముగుస్తున్నప్పుడు, మన తల్లుల శరీరాలలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఇది ఒక పురుషుడి శరీరంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే పురుషుల్లో కూడా వారి తల్లులు ఒక నిర్దిష్ట విధానంలో భాగమై ఉంటారు. శారీరకంగా కాకపోయినా, వేరే విధానాల్లో వారు వారిలో భాగమై ఉంటారు.
అంటే అందరి శరీరాల్లో కొంత గందరగోళం ఏర్పడుతుంది. శరీరం గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎంత ఖాళీగా ఉంచగలిగితే అంత ఖాళీగా, ఎంత చేతనంగా ఉంచగలిగితే అంత చేతనంగా ఉంచటం ఉత్తమం. స్పృహతో ఉండటానికి సులువైన మార్గాల్లో ఆహరం తీసుకోకపోవటం ఒకటి. అప్పుడు మీరు కనీసం ఒక్కదాని గురించైనా నిరంతరం స్పృహతో ఉంటారు. మీ కడుపు ఖాళీ అవ్వగానే, మీ చేతనా సామర్ధ్యం చాలా మెరుగవుతుంది. మీ శరీరం మరింత పారదర్శకంగా మారుతుంది, మీరు మీ వ్యవస్థలో ఏమి జరుగుతుందో మరింత మెరుగ్గా గమనించగలగుతారు
Source: http://isha.sadhguru.org/blog/te/2015/04/03/chandragrahanam-aaharam/