Home / health / నాభి (బొడ్డు) ని ముట్టుకుంటే ఇబ్బందితో కూడిన అనుభూతి. అలా ఎందుకు జరుగుతుంది?

నాభి (బొడ్డు) ని ముట్టుకుంటే ఇబ్బందితో కూడిన అనుభూతి. అలా ఎందుకు జరుగుతుంది?

Author:

మానవ శరీరంలో నాభి (బొడ్డు) ఒక ప్రత్యేకమైన శరీరభాగం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ బొడ్డుతాడు ద్వారే బిడ్డ కి ఆహారం చేరుతుంది. ప్రసవసమయంలో ఆ బొద్దుతాడుని కత్తిరిస్తారు. కానీ  నాభి (బొడ్డు) ని ముట్టుకుంటే ఇప్పటికీ చెప్పలేని ఒక ఇబ్బందితో కూడుకున్న అనుభూతి కలుగుతుంది. అలా ఎందుకు కలుగుతుందో తెలుసా?

న్యూయార్క్ లోని NYC సర్జికల్ అసోసియేట్ అయిన  Dr. క్రిష్టోపర్ హోల్లిన్గ్స్వర్త్ ప్రకారముగా, మనం మన బొడ్డుని ముట్టుకుంటే అది మన శరీరాన్ని తాకునట్టుగా మాత్రమే కాక, మన శరీరం లోపలి భాగాలని కూడా  తాకినట్టుగా అనిపిస్తుందని చెప్పారు.  ఎందుకంటే మన బొడ్డు నుండి మన శరీరం లోని వివధ అవయవాలకి ఒక సిగ్నలింగ్ వ్య‌వ‌స్థ‌ ఉంటుందట. అందుకే  మనం బొడ్డుని చేతివేలితో నొక్కినట్లయితే అక్కడి నుండి వెన్నెముకకు ఒక సిగ్నల్ అనేది వెళ్తుంది. వెన్నెముక మన శరీరానికి సిగ్నల్స్ పంపిస్తుంటాయి, కొందరిలో ఆ సిగ్నల్ బ్లాడర్ కి కుడా పంపబడటంవల్ల వాళ్లకి టాయిలెట్ కి వెళ్ళమనే సింగల్ ను ఇస్తుంది. ఇది కొంతమంది లో జరిగే అసాధారణ విషయం.

nanana

మన గ‌ర్భ‌స్థ‌ శిశువుగా ఉన్నప్పుడు మనకి మన తల్లి తీసుకొనే ఆహారం ఆ బొడ్డు నుండే మన దేహంలో ఉన్న ప్రతీ అవయవానికి చేరితుంది. కాబట్టి మన శరీరంలో ఉండే ప్రతీ అవయువానికి బొడ్డుకి ఒక సిగ్నలింగ్ వ్య‌వ‌స్థ‌ నడుస్తుంది. అందువల్లే ఎవ‌రైనా మన బొడ్డును ముట్టుకుంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)