Home / Inspiring Stories / ఆమె భర్త ఏది కావాలంటే తెచ్చిచ్చేవాడు, ప్రేమగా చూసుకునేవాడు..! అయిన ఆ భార్య విడాకులు కోరింది, ఎందుకో తెలుసా..?

ఆమె భర్త ఏది కావాలంటే తెచ్చిచ్చేవాడు, ప్రేమగా చూసుకునేవాడు..! అయిన ఆ భార్య విడాకులు కోరింది, ఎందుకో తెలుసా..?

Author:

విడాకుల కోసం కోర్టు మెట్లెక్కే వారి సంఖ్య రానురాను పెరిగిపోతున్న సంగతి తెలిసిందే, చిన్న చిన్న విషయాలకే గొడవ పెట్టుకొని, ఆ గొడవలని పెద్దవిగా చేసుకొని విడాకులు కోసం అనేక జంటలు ప్రపంచవ్యాప్తంగా కోర్టు తలుపులు కొడుతున్నాయి, చాలా జంటలు భర్త మంచిగా చూసుకోవట్లేదనో, భార్య ప్రవర్తన బాలేదనో, భార్య కంటే తన తల్లికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనో, మరేదో కారణాలతో విడాకులు కోరుకుంటున్నారు, కానీ ఒక భర్త తను కట్టుకున్న భార్యని తన తల్లి కంటే ఎక్కువ బాగా చూసుకుంటున్నాడు, తను అడిగిందల్లా ఇస్తున్నాడు , తను కోరిన ఏ చిన్న కోరికైనా సరే చిటికెల మీద తీర్చేవాడు, తన తల్లి ఏమైనా అడిగితే చిరాకుపడేవాడు తప్ప భార్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు… అంతెందుకు..? సింపుల్‌గా చెప్పాలంటే, తనకన్నా నాకు ఈ లోకంలో ఎవరూ ఎక్కువ కాదు అన్నంతగా ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు… అయిన ఆమె అంతగా ప్రేమించే భర్త నుండి విడాకులు అడిగింది..!

wife-get-divorce-from-him-who-loved-her-more-than-his-mother

న్యాయస్థానంలో సదరు 29 ఏళ్ల భర్త ఆశ్చర్యంగా తన భార్య వైపు చూస్తూ అడిగాడు… ‘‘నేను చివరకు నా కుటుంబాన్ని కూడా నీకోసం వదిలేసుకోలేదా..? నిన్ను ప్రేమగా చూసుకోలేదా..? ఏదడిగితే అది సమకూర్చలేదా..? ఎంత ఖర్చు చేశాను నేను…? పోనీ, నేనేం తప్పు చేశాను…? నేను విడాకులు ఇవ్వను… నువ్వు నాకు కావాలి…’’

‘‘లేదు… నువ్వు చెప్పిన ఏ విషయాన్ని కూడా నేను ఖండించడం లేదు… నిజానికి నువ్వు సరిగ్గా చెప్పలేకపోతున్నావు గానీ ప్రపంచంలో ఏ భర్తా నీ అంతగా ఒక భార్య కోరికలకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడు… అనేకానేక కుటుంబాల్లో అత్తలు, కోడళ్ల అహాలు కాపురాల్ని కూలుస్తాయి, నరకంగా మారుస్తాయి… భర్తలు కూడా తమ తల్లులు, భార్యల నడుమ నలిగిపోతారు… కానీ మన విషయంలో అదేమీ లేదు… నేనేది అడిగితే అది దొరికింది నీవల్ల… నువ్వు చివరకు నీ తల్లిని కూడా నిర్లక్ష్యంగా వదిలేశావ్…’’

న్యాయమూర్తి కూడా విస్తుపోతూ… అంత బాగా చూసుకుంటున్నాడని నువ్వే మెచ్చుకుంటున్నావు… మళ్లీ నువ్వే విడాకులు కావాలంటున్నావ్… ఇదేమిటి..?’ అనడిగాడు… ‘‘చివరకు తన తల్లిని కూడా విస్మరించి, చిన్న చిన్న విషయాల్లో సైతం ఆమెను ఖాతరు చేయకుండా, మరీ నిన్ను నెత్తిన పెట్టుకున్నాడని నువ్వే అంటున్నావుగా..’’ అని రెట్టించాడు…

‘‘అవును న్యాయమూర్తి గారూ… నేను విడాకులు కోరటానికి కారణం సరిగ్గా అదే… ఒక తల్లి పట్ల అలా వ్యవహరించేవాడిని అస్సలు నమ్మలేం… నమ్మకూడదు… తను జీవితంలో ఏదో ఓ క్షణంలో నా పట్ల కూడా ఇలాగే మారతాడు… ఆ పరిస్థితి వచ్చేదాకా ఆగలేకే నేనే విడాకులు అడుగుతున్నాను…’’ అంది ఆ భార్య నెమ్మదిగా… భర్త, జడ్జి, అక్కడున్న లాయర్లు అందరూ షాక్… ఒకరిద్దరి కళ్లల్లో తడి… ఆమె నిర్ణయం పట్ల అభినందనతో కూడిన ఆశ్చర్యం…

‘‘నిజమే, తన తల్లిని మించిన స్థానాన్ని భార్యకు ఇచ్చే ఏ మగాడినీ నమ్మొద్దు సారూ… తన జీవితంలోకి ప్రవేశించిన ఒక మహిళ కోసం తనకు జన్మనిచ్చిన మహిళను నిర్లక్ష్యం చేసేవాడు ఎప్పుడోసారి భార్యనూ అలాగే వదిలేస్తాడు కదా సార్… ఓ బిడ్డను కనే దగ్గర్నుంచి, పెంచి పెద్దచేసి, ప్రయోజకుడు అయ్యేవరకు తల్లి చేసే త్యాగాన్ని గుర్తించని మగాడి నిజాయితీలో, ప్రేమలో విశ్వసనీయత ఎక్కడుంటుంది సార్…? రేపు నా కొడుకూ ఇలాగే చేస్తే…?’’ అందామె… న్యాయమూర్తి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు… ఆమెకు వెంటనే విడాకులు మంజూరు చేశాడు… ఆ భర్త ఇప్పటికీ ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు….

(Visited 951 times, 1 visits today)