Home / Inspiring Stories / గత 34 సంవత్సరాల నుండి రైల్వే స్టేషన్స్ లలో మనకి వినిపించే గొంతు ఈమెదే…!

గత 34 సంవత్సరాల నుండి రైల్వే స్టేషన్స్ లలో మనకి వినిపించే గొంతు ఈమెదే…!

Author:

మనం రైల్వే స్టేషన్ కి వెళ్లిన ప్రతిసారి “యువ‌ర్ అటెన్ష‌న్ ప్లీజ్‌… ద‌య‌చేసి వినండి… ట్రెయిన్ నంబ‌ర్‌… సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌… మ‌రికొద్ది నిమిషాల్లో 1వ నంబ‌ర్ ప్లాట్‌ఫాంపైకి వ‌చ్చును..” అనే అనౌన్స్‌మెంట్‌ ని ఖచ్చితంగా వింటాం, ఆ అనౌన్స్‌మెంట్‌ ని వినని వారు ఉండరు అనేంతలా పాపులర్ అయింది. ఈ అనౌన్స్‌మెంట్‌ లో మనకి ఒక మహిళ గొంతు వినిపిస్తుంటుంది, ఆ మహిళ ఎవరు అయి ఉంటారని చాలా మంది అనుకుని ఉంటారు, అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్.

your attention please voice

1982 వ సంవత్సరంలో ముంబై రైల్వే స్టేషన్ కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే జోన్ లో రైళ్ల రాకపోకలని మైక్ లో చదివేందుకు ఒక ఉద్యోగిని ఏర్పాటు చేయాలనీ అప్పటి రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ బెన‌ర్జీ భావించి దరఖాస్తులని ఆహ్వానించారు, ఆ రైల్వే అనౌన్స‌ర్ ఉద్యోగం కోసం చాలా మంది యువ‌తులు వ‌చ్చారు, అందరిని వాయిస్ టెస్ట్ చేస్తున్న అశుతోష్ బెన‌ర్జీకి సరళా చౌదరి అనే అమ్మాయి గొంతు బాగా నచ్చింది, ఆ రైల్వే అనౌన్స‌ర్ ఉద్యోగం ఆ అమ్మాయికి వచ్చేలా జీఎం అశుతోష్ బెన‌ర్జీ రికమండ్ చేసారు, ఇక అప్పటి నుండి సరళా చౌదరి రైళ్ల రాకపోకలకి సంబంధించిన అన్నౌన్స్ మెంట్ చేస్తూ ఉండేది, ఆ కాలంలో కంప్యూటర్ లు లేకపోవడంతో ప్రతిసారి సరళా చౌదరియే ప్ర‌తి అనౌన్స్‌మెంట్‌ను చ‌దివి వినిపించాల్సి వ‌చ్చేది, 1991 లో రేడియోలో ఆమె గొంతుని రికార్డు చేసి అన్ని స్టేషన్ లలో వినిపించేవారు, కంప్యూటర్ల యుగం వచ్చిన తరువాత రైల్వేలో ట్రెయిన్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ (టీఎంఎస్‌)ను ఏర్పాటు చేశారు. దీంతో స‌ర‌ళా చౌద‌రి త‌న గొంతుతో ఒకేసారి కొన్ని వేల‌ రికార్డింగ్స్ చేసి ఇచ్చేసింది. వాటిని రైల్వే వారు భ‌ద్ర‌పరిచి టీఎంఎస్ అనుసంధానంతో ఆటోమేటిక్‌గా అనౌన్స్‌మెంట్ వ‌చ్చేలా ఏర్పాటు చేశారు.

సరళా చౌదరి దాదాపు 18 సంవత్సరాలు రైల్వేలో ఉద్యోగం చేసి 2000 వ సంవత్సరంలో పదవి విరమణ చేసింది, ఇప్పటికి రైల్వే స్టేషన్ లలో సరళా చౌదరి వాయిస్ యే వినిపిస్తుంది, ఆ గొంతును ఆమె స్వ‌యంగా వింటున్న‌ప్పుడు ఎంతో ఉద్వేగానికి లోన‌వుతుంటుంది కూడా. ఏది ఏమైనా ఆమెకు ఉన్న మృదువైన కంఠాన్ని, ఆ రైల్వే అనౌన్స్‌మెంట్ల‌ను మ‌న జ‌నాలు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేరు క‌దా..!

(Visited 4,519 times, 1 visits today)