ఆంధ్ర ప్రదేశ్ విపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి మరోసారి నిరాహారదీక్షకు సిద్దమౌతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యే క హోదా కోసం తాను ప్రాణ త్యాగనికైనా వెనుకాడనని గతం లో తాను అన్న మాటపైనే నిల బడి ఈ సారి ఆమరణ నిరాహార ధీక్షకు రేడీ అవుతున్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేస్తే ఇప్పుడు ఆ గౌరవాన్ని చంద్ర బాబూ, తెలుగుదేశం పార్టీ మంటగలుపుతున్నారనీ, డిల్లి పీటం పై ఉన్న పెద్దలకు బంట్లుగా వ్యవహరిస్తున్నారనీ అన్న జగన్. వైఎస్ రాజశేఖరరెడ్డి కోరుకున్న రైతు రాజ్యం కోసం తాను చివరి వరకూ పోరాడతాననీ జగన్ అన్నారు. మొదట ఈ నెల 15వ తేదీ నుంచే ఆయన ఆమరణ దీక్ష మొదలుపెట్టాలని అనుకున్నారు. అయితే 17న వినాయకచవితి పండగ ఉన్న సందర్భంగా కనీసం కొన్ని రోజుల పాటూ సాగే ఈ “ఆమరణ దీక్ష” కు జనం కొరత ఏర్పడుతుందనే వాదన పార్టీ నాయకుల నుంచి వచ్చింది. జనం లేకుండా జగన్మోహన్ రెడ్ది ధీక్ష కి సరైన స్పందన రావటం కుదరక పోవటం తో వినాయక చవితిని పరిగణనలోకి తీసుకుని. తన ఆమరణ నిరాహార దీక్ష ముహూర్తాన్ని మార్చుకోవాలని నిర్ణయించారు. ఆ మేరకు సెప్టెంబరు 26 నుంచి జగన్ ఆమరణ దీక్ష మొదలవ్వొచ్చని తెలుస్తోంది.
ఈ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా వైఎస్ జగన్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నారని అనుకోవాలి. ప్రత్యేక హోదా కుదరదు అని కేంద్రం తేల్చి చెప్పేసాక తెలుగుదేశం తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడంతో జగన్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం పార్టీ శ్రేణులు అందరినీ భారీ గా తరళించుకుని వెళ్ళి దేశ రాజధాని డిల్లీ లో ఢిల్లీలో ఒకరోజు దీక్ష చేశారు.
అసెంబ్లీలో కూడా మౌనం వహించిన తెలుగు దేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించడం లేదంటూ తన వాదనను బలంగానే వినిపించారు. ఫలితంగా మొత్తానికి అక్కడ ఒక మొక్కు బడి తీర్మానం జరిగింది. అయితే ఆ తీర్మాణం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అనుకున్న జగన్ సరైన ఫలితం రావాలంటే. మరింత బలమైన ఉద్యమం తప్పదని నిర్ణయించుకున్నారు. అందుకే స్వయంగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. హోదా విషయంలో మడమ తిప్పే ప్రసక్తే లేదని కేంద్రం దిగివచ్చే వరకు తమ పోరాటం సాగుతుందని విపక్ష నేత చెబుతున్నారు. కాగా ప్రత్యేక హోదా కోసం ఆమరణ ధీక్ష అన్న నటుడు శివాజీ ఈ సారి పార్టీలకతీతంగా జగన్ కి మద్దతు ఇస్తాడా లేదా అని కొందరు అనుకోవటం వినిపిస్తోంది. నటుడు శివాజీ కి గనక నిజంగా రాష్ట్రం పై, రాష్ట్ర ప్రజల పై ప్రేమ ఉంటే జగన్ కి మద్దతుగా నిలబడి తీరాలని కొందరు వైకాపా కార్యకర్తలు సవాల్ విసిరారు..