Home / Inspiring Stories / పతకాలతో కాదు, వ్యక్తిత్వంతో మనసులు గెలిచిన యోగేశ్వర్ దత్.

పతకాలతో కాదు, వ్యక్తిత్వంతో మనసులు గెలిచిన యోగేశ్వర్ దత్.

Author:

చట్టవిరుద్దం అని తెలిసినా మనదేశంలో కట్నాలు ఇవ్వకుండా, తీసుకోకుండా వివాహాలు జరగడంలేదన్నది అందరికి తెలిసిన విశయమే, కాని ఎవ్వరూ దానిపై నోరు విప్పి మాట్లడరు. ప్రతి సంవత్సరం సగటుగా 8000 మంది ఆడబిడ్డలు కట్నం కోసం పెడుతున్న చిత్రహింసలను తట్టుకొలేక ప్రాణాలు విడుస్తున్నారు. ఇటువంటి పరిస్తితుల్లో 2016 ఒలింపిక్స్ లో మనదేశానికి కాంస్య పతకాన్ని అందించిన యోగేశ్వర్ దత్ తీసుకున నిర్ణయాన్ని మనమందరం అభినంధించాల్సిందే. సమాజంలో తనకున్న పేరుకు తగ్గట్లు కోట్ల కొద్ది కట్నం తీసుకునే అవకాశం ఉన్నా అతను మాత్రం తనకు కాబొయే భార్య నుండి అసలు కట్నం తీసుకోలేదు. కేవలం సాంప్రదాయాలను పాటించడం కోసం కేవలం ఒక రూపాయి ని కట్నం గా స్వీకరించనున్నాడు. జనవరి 16 న యోగేశ్వర్ వివాహం శీతల్ తో జరగనుంది.

yogeshwar dutt received 1 rupee shagun

ఈ విశయంపై స్పందించిన యోగేశ్వర్, తమ కుటుంబంలోని అమ్మాయిల వివాహాలు చేయడానికి తాము ఎంతా కష్టపడ్డామో తనకు తెలుసునని, అలాంటి కష్టం ఇంకోకరికి రాకూడదని తాను చిన్నప్పుడే కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకుందామనుకున్నానని తెలిపాడు. తనకు రెండే కోరికలు ఉండేవని అందులో ఒకటి రెజ్లింగ్ లో మంచి స్థానానికి చేరుకోవడం మరియు కట్నం లేకుండా పెళ్ళి చేసుకోవడం, ఇప్పుడు ఆ రెండు నెరవేరాయని చెపాడు యోగేశ్వర్ దత్.

(Visited 268 times, 1 visits today)