Home / Technology / మీరు వద్దనుకున్న శబ్దాలు వినకుండా మీ చెవులను ఆపవచ్చు.

మీరు వద్దనుకున్న శబ్దాలు వినకుండా మీ చెవులను ఆపవచ్చు.

Author:

మనిషి అవసరాల నుండే కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయన్నది 100% నిజం. ఆదివారం వచ్చింది ఇంట్లో ప్రశాంతంగా ఉందామని అనుకునేలోపే పక్క ఇంట్లో నీటి బోర్ వేయడం మొదలు పెడితే ఆ కర్ణ కఠోర శబ్దానికి మనకు కలిగే అసహనం మాటల్లో వర్ణించలేనిది. ఇకనుండి అలాంటి బాధలు పడాల్సిన అవసరంలేదంటొంది నెదర్లాండ్స్ కి చెందిన ఒక స్టార్టప్ కంపనీ. తాము తయారుచేసిన క్నాప్స్ అనే వాల్యూం బటన్ ను చెవిలో పెట్టుకుంటే మనం వద్దనుకున్న శబ్దాలు మనకు వినపడవు. కావాలంటే క్రింది వీడియోను ఓ లుక్కేయండి.

సాధారణ వైర్ లెస్ హియర్ ఫోన్సు లాగే ఉండే క్నాప్స్ ను మన రెండు చెవులలో పెట్టుకోవాలి. ఆ క్నాప్స్ కి నాలుగు ఆప్షన్లు ఉంటాయి, ఎదైనా విసుగు చెందించే శబ్దం వస్తున్నప్పుడు ఆ క్నాప్ కి ఉన్న ఆప్షన్ మారిస్తే ఆ శబ్దం మనకు వినపడదు. వీటివలన చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు వీటి సృష్టికర్తలు, విద్యార్దులు చదువుకునేటప్పుడు ఇతర శబ్దాలు డిస్టర్బ్ చేయకుండా ఇవి అడ్డుకుంటాయి, ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రశాంతత కొరకు ఇవి వాడవచ్చు. అక్కడైతే తెలియదు కాని మనదేశంలో మాత్రం ఇవి చాలా అవసరం శబ్ద కాలుష్యం రోజు రోజుకి పెరుగుతున్న వేళ ఈ పరికరం మనదేశానికి వస్తే మాత్రం మంచి గిరాకి ఉంటుంది.

(Visited 139 times, 1 visits today)