Home / Inspiring Stories / ఇప్పటికీ మీ పాత 500 నోట్లను ఈ 20 ప్రాంతాల్లో ఉపయోగించుకోవచ్చు.

ఇప్పటికీ మీ పాత 500 నోట్లను ఈ 20 ప్రాంతాల్లో ఉపయోగించుకోవచ్చు.

Author:

నల్లధనాన్ని మరియు దొంగనోట్లను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసింది. ఈ నిర్ణయంతో మొదలైన సామాన్యుల కష్టాలు ఇంకా తగ్గలేదు. నిన్నటివరకు కొనసాగిన రద్దు చేసిన పాత 500, 1000 నోట్ల మార్పిడి ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుండి నిలిపివేసింది. ఇకనుండి కేవలం రద్దు చేసిన నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి తర్వాత డబ్బును తీసుకోవాల్సిందే. కాని దీనివల్ల ఎదురయ్యే సమస్యల నుండి ఉపశమనం కల్పిస్తు పాత 500 రూపాయలను ఈ కింద చెప్పిన 20 ప్రాంతాల్లో డిసెంబర్ 15 వరకు ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఆ 20 ప్రాంతాల జాబితా మీ కోసం.

old-500-rupee-note-exchange-places

డిసెంబర్ 15. వరకు పాత 500 రూపాయల నోటు క్రింది వాటికి ఉ ఉపయోగించవచ్చు:

1) ఒక వైద్యుడి యొక్క ప్రిస్క్రిప్షన్ తో, ప్రభుత్వ ఆసుపత్రి బిల్లులు కట్టడానికి మరియు మందులు కొనుగోలు చేయడానికి
2) రైల్వే స్టేషన్ కౌంటర్లు, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నడిపే బస్సులు టికెట్ కౌంటర్లు మరియు విమానాశ్రయాలు వద్ద గల టికెట్ కౌంటర్లు .
3) వినియోగదారు సహకార దుకాణాలలో కొనుగోళ్లు రూ .5,000 పరిమితి వరకు.
4) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేసే పాల కేంద్రాలు.
5) ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొనుగోలు.
6) శ్మశానాలలో అయ్యే ఖర్చులు
7) అంతర్జాతీయ విమానాశ్రయాలలో అన్ని విభాగాలలో
8) విదేశీ పర్యాటకులు పాత భారత కరెన్సీ నుండి వారి కరెన్సి కి మార్పిడికి.
9) అన్ని మందుల దుకాణాల వద్ద (వైద్యుడి యొక్క ప్రిస్క్రిప్షన్ మరియు ID ప్రూఫ్ ఉండాలి).
10) గ్యాస్ సిలిండర్ల కొనుగోళు కొరకు
11) రైలు ప్రయాణ సమయంలో క్యాటరింగ్ సేవలకు చెల్లింపు.
12) సబర్బన్, మెట్రో రైలు సర్వీసుల వద్ద టిక్కెట్లు కొనుగోలు.
13) భారతదేశ పురావస్తు శాఖ వారు నిర్వహిస్తున్న అన్ని స్మారక ప్రదేశాల ప్రవేశ టిక్కెట్ల కొనుగోలుకు.
14) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించవలసిన, పురపాలక మరియు స్థానిక సంస్థలకు చెల్లించవలసిన ఫీజులు, చార్జీలు, పన్నులు లేదా జరిమానాలు చెల్లించడానికి.
15) నీరు, విద్యుత్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు.
16) కోర్టు ఫీజు కోసం.
17 గుర్తింపు పొందిన కేంద్రాల నుండి విత్తనాలు కొనుగోలు కోసం.
18) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక మరియు స్థానిక-బాడీ పాఠశాలల్లో రూ 2,000 వరకు విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లింపునకు.
19) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో ఫీజు చెల్లింపునకు.
20) రూ 500 వరకు ప్రీ పెయిడ్ మొబైల్ సిమ్స్ రీఛార్జ్ కొరకు.

Must Read: ఈ నెల 28 న భారత్ బంద్..!

(Visited 3,586 times, 1 visits today)