Home / Latest Alajadi / క్యూ పాటించమన్నందుకు ఎస్ఐనే చంపబోయారు!!!

క్యూ పాటించమన్నందుకు ఎస్ఐనే చంపబోయారు!!!

Author:

మనకేదైనా ఆపదగాని, కష్టంగాని వస్తే సాయం కోసం పోలీసులని ఆశ్రయిస్తాం. ఈ మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపమైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అని సినిమా డైలాగ్ ఉంది. అంతటి శక్తివంతమైన పోలీసుకి నేడు రక్షణ కరువైనది. ఎంతలా అంటే క్యూ పాటించమన్నందుకు ఏకంగా ఎస్ఐని చంపేంతలా…

మహారాష్ట్రలో నలుగురు యువకులు ఓ ఎస్ఐపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. తాణేలోని కళ్యాణ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి గణేష్ నిమర్జనాలు జరుగుతుండగా కొందరు బారీకేడ్లు అడ్డుపెట్టి శోభాయాత్రను, నిమర్జనాన్ని అడ్డుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకొని క్యూ పాటించి శోభాయాత్రకు సహకరించాలని కోరారు. దానితో ఆగ్రహించిన నలుగురు యువకులు ఒక్కసారిగా ఆ ఎస్ఐని చెరువులోకి నెట్టివేశారు. అతనిపై పిడిగుద్దులు గుద్దుతూ, నీళ్ళల్లో ముంచుతూ హతమార్చేందుకు ప్రయత్నించారు. ఎలాగోలా ఆ ఎస్ఐ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనను వీడియో ఇంటర్నెట్ లో పెట్టడంతో వైరల్ గామ మారింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దాడికి పాల్పడ్డ వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

(Visited 994 times, 1 visits today)