EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / Inspiring Stories / మహిళా దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

మహిళా దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

Author:
ప్రతి సంవత్సరం మార్చి 8 న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతారు కాని ఇదే రోజున ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో చాలా మందికి తెలియదు. ఈరోజుల్లో మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నా కాని ఒకప్పటి పరిస్తితులు వేరు. పురుషులతో సమానమైన పని చెసినా వారికి సరైన వేతనం వచ్చేది కాదు పురుషులతో సమానమైన వేతనాలు మరియు సమాన పని సమయం కోసం అమెరికా లోని పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో మొదటిసారిగా మహిళలు సమ్మే, ఆందోళనల బాట పట్టారు, చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమై అక్కడి మహిళలకు పురుషులతో సమాన గౌరవం దక్కింది. అందుకే అప్పటి నుండి మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడం మొదలుపెట్టారు.
 history of womens day
దేశం, జాతి, భాష, రాజ్యం, సాంసృతిక భేదభావాలకు తావు లేకుండా చాలా దేశాలలో మహిళలందరూ ఒకచోట చేరి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటారు. యుద్ధం కారణంగా మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ పార్శీ మహిళలు ఇదే రోజు వెర్సెల్స్‌లో ఒక ప్రదర్శన జరిపారు. 1910 సంవత్సరంలో కొపెన్‌హెగన్‌లో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ వారు మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం జరిపారు. 1911 సంవత్సరంలో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాల్లో మహిళా దినోత్సవం నాడు తమ హక్కుల కొరకు లక్షలాదిగా మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. దానితో ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజుకు ప్రాముఖ్యత పెరిగి అన్ని దేశాలలో మహిళా దినోత్సవం జరపడం మొదలయ్యింది. 1977 లో ఐక్యరాజ్య సమితి మార్చి 8 న మహిళా దినోత్సవం గా అధికారికంగా ప్రకటించింది. మతాధికారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగు ప్రాధాన్యత, కార్యక్షేత్రంలో వివక్ష నిర్మూలన తదితర డిమాండ్ల సాధనకు మహిళలు ఈ రోజు నిర్వహించుకుంటారు. మహిళలు సాధించిన విజయాలకు చిహ్నంగా సాధికారతను పొందే క్రమంలో ప్రతి యేటా మార్చి ఎనిమిదవతేదీన విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Comments

comments