Home / Political / మరో 15 వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ రెడీ.

మరో 15 వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ రెడీ.

Author:

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు సంతోషపడే వార్తని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అందించింది, తెలంగాణ ఏర్పడిన నాటినుండి ఎప్పటి వరకు 3000 ఉద్యోగాల దాకా భర్తీ చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎప్పుడు భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి రంగం సిధ్దం చేస్తుంది, 8 నెలల కిందట గ్రూప్-2 కి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి దానిని పోస్టుపోన్ చేయడంతో నిరోద్యుగులు చాలా నిరుత్సాహానికి గురయ్యారు, ఇప్పుడు మరికొన్ని ఉద్యోగాలని కలిపి గ్రూప్-2 పరీక్షని నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాయత్తం అవుతుంది.

మరో 15 వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ రెడీ.

మరో 15 వేల సర్కార్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య ఆరోగ్యశాఖలో నాలుగు వేల పోస్టులు, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో 2 వేల ఖాళీలు, విద్యాశాఖలో నాలుగువేల ఉద్యోగాలు, గ్రూప్ 2 లో వెయ్యి ఉద్యోగాల భర్తీకి సర్కార్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు పురపాలక, వ్యవసాయం, జలవనరులు, విద్యుత్ శాఖ, ఎక్సైజ్, కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీ లతో కలిపి మరో 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీనికోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తును ముమ్మరం చేసింది.

త్వరలోనే గ్రూప్-2 పరీక్షని నిర్వహించి ఆ తరువాత మిగిలిన ఉద్యోగాల ప్రక్రియని త్వరగా పూర్తి చేయాలనీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి, మరో 6 నెలల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియని పూర్తి చేసేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ని రెడీ చేసి వారం రోజుల్లో ప్రభుత్వ ఆమోదానికి పంపే విధంగా అధికారులు కసరత్తును ముమ్మరం చేసారు.

(Visited 858 times, 6 visits today)