Home / Political / నగదు విత్ డ్రా చేసుకుంటే ఇకపై 2% వరకు సర్ ఛార్జి

నగదు విత్ డ్రా చేసుకుంటే ఇకపై 2% వరకు సర్ ఛార్జి

Author:

రోజుకో నిబంధన తెస్తూ ప్ర‌జ‌ల‌ను అయోమ‌యానికి గురిచేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా మ‌రో రూల్ తీసుకొచ్చేందుకు త‌యారైంది. డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించే భాగంలో ఇక‌పై ప‌రిమితికి మించిన డ‌బ్బును బ్యాంక్‌నుంచి కానీ, ఏటీఎం నుంచి కాని విత్ డ్రా చేస్తే స‌ర్‌ఛార్జ్ విధించాల‌ని కేంద్రం యోచిస్తోంది. సర్ ఛార్జి 0.5-2 శాతం మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 30 తరువాత ఇది అమల్లోకి రానుందని సమాచారం. కనీస పరిమితికి మించి నగదు తీసుకుంటే ఈ సర్‌ఛార్జి వర్తిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కనీస మొత్తం ఎంతన్నదానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. అందిన సమాచారం మేరకు బ్యాంకుల నుంచి రోజుకు రూ.50 వేలు, ఏటీఎంల నుంచి రోజుకు రూ.15 వేలు మించి విత్‌డ్రా చేసుకుంటే సర్‌ఛార్జి విధించే అవకాశం ఉంది.  ప్ర‌స్తుతం ఉన్న క్యాష్ విత్‌డ్రాల్ లిమిట్ డిసెంబ‌ర్ 30తో ముగుస్తుంది. ఆ త‌ర్వాత క్యాష్‌ను ఎంతైనా తీసుకోవ‌చ్చ‌ని చెప్పిన ప్ర‌భుత్వం దానికి కూడా స‌ర్‌ఛార్జ్ పేరుతో మెలిక పెట్టింది. బ్యాంకుల్లో న‌గ‌దు నిల్వ‌లు లేవు కాబ‌ట్టి  స‌ర్‌ఛార్జ్ విధిస్తే కొంత నియంత్రించొచ్చు అన్న ఆలోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్లు స‌మాచారం.నల్లధనాన్ని అదుపు చేయడంపై జస్టిస్‌ ఎం.బి.షా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒకటయిన సర్‌ఛార్జి విధింపును పరిశీలిస్తున్నారు. ‘నిర్వహణ వ్యయం’ పేరుతో దీన్ని వసూలు చేయనున్నారని తెలిసింది.

surcharge applicable for exceeding cash withdrawal limit

నగదు లావాదేవీలపై ఆంక్షలు పెడుతూ మరికొన్ని ప్రతిపాదనలు

  • 3లక్షలకు మించిన లావాదేవీలను నగదు రూపంలో జరపడాన్ని పూర్తిగా నిషేధించడం.
  • ప్రతి కుటుంబమూ రూ.15 లక్షలకు మించి నగదు ఉంచుకోవడాన్ని నిషేధించడం
  • ప్రభుత్వ సంస్థలకు రూ.లక్షకు మించిన నగదు చెల్లింపులపై సర్‌ఛార్జి విధించడం
  • అన్ని కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలను చెక్కులు/ డిజటల్‌ మార్గాల్లోనే చెల్లించాలని ఆదేశించింది.
(Visited 454 times, 8 visits today)