చార్మింగ్ బాయ్ రామ్ హీరోగా వస్తున్న హై వోల్టేజ్ లవ్ స్టోరీ ‘శివమ్’. షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్నట్టే. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ
జయంతి సందర్భంగా విడుదల కానుంది. రామ్ సొంత బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన శివం ఆడియో ను ఆడియోను ఈనెల 12న పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ హైవోల్టేజ్ స్టోరీకీ,రాం ఎనెర్జిట క్ తత్వానికీ
సరిపోయేలా అద్బుతమైన ట్యూన్స్ ఇచ్చాడట దేవి. మరి దేవీ ట్యూన్లకి ఎలాణ్తి స్టెప్పులేస్తాడో చూడాల్సిందే. నార్వే,స్వ్వ్డన్ లలో పాటలు షూట్
చేసారు. తమిళ హీరో జీవా హీరో గా వచ్చిన రంగం సినిమా పాటలని చిత్రీక రించిన కలర్ ఫుల్ లొకేషన్ లలో శివం ఆడీ పాడాడట. “కథాబలం ఉన్న చిత్రం ఇది. స్ర్కీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా కుదిరింది. మంచి హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి’ అని చెప్పిన స్రవంతీ రవి కిషోర్ ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచారు. బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరుల పై చిత్రించిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులని నవ్వించేలా ఉంటాయట. ఒక పాట పూర్తి లోకల్ గా హైదరాబాద్ రోడ్లపై షూటింగ్ జరుపుకుంది. మరో పాట చర్చిలో షూట్ చేయాల్సి వుంది. దీన్నీ ఈ వారం ఫినిష్ చేసి,
12న ఆడియో ఫంక్షన్ జరిపేయాలని ఆలోచిస్తున్నారు.
స్రవంతీ మూవీస్ సంస్థ పరిశ్రమలో కి అడుగుపెట్టి 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వస్తోన్న శివమ్ సినిమాను అన్ని విధాలా ది బెస్ట్ అనిపించేలా రాం కెరీర్ కి ప్లస్ అయే విధంగా ఒక మాస్టర్ పీస్ గా నిలిచేలా రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. దానిలో భాగం గానే హీరో రామ్ ఈ మధ్యనే హైద్రాబాద్‌లోని ఓ ఎఫ్.ఎం. చానల్‌లో శివం సినిమాకు సంబంధించిన ఓ పాటను విడుదల చేసేసారు కూడా. రామ్ సరసన రాశిఖన్నా
హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాతో రామ్ మరో హిట్ కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. శివం రిలీజ్ అయ్యే రోజునే అంటే అక్టోబర్ 2 నే మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె కూడా విడుదలవనుంది. ఒకరకంగా చారిత్రాత్మ క ప్రేమ కథ గా వస్తున్న కంచె రాం కి పోటీ అవొచ్చన్ తున్నారు సినీ విశ్లేషకులు.