Home / Reviews / మూవీ రివ్యూ: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’

మూవీ రివ్యూ: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’

Author:

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో బయోగ్రాఫికల్‌ మూవీ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు. ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన వెన్నుపోటు అంశంపై సినిమాలో చర్చించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రిలీజ్‌పై స్టే విధించటంతో ఇతర ప్రాంతాల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వర్మ చెప్పినట్టుగా నిజంగా నిజాలనే తెరకెక్కించాడా..? ఎన్టీఆర్‌ అసలైన బయోపిక్‌ ఈ సినిమానేనా..?

కథ:

1989 ఎన్నికల్లో ఓటమి అనంతరం ఎన్టీఆర్ ఒక రకమైన నైరాశ్యంలో ఉంటూ ఒంటరితనం అనుభవిస్తూ సమయంలో ఆయన జీవిత కథ రాసేందుకు లక్ష్మీపార్వతి వస్తుంది. లక్ష్మి వ్యక్తిత్వం నచ్చి తన జీవిత కథను రాసేందుకు ఆమెకు అనుమతి ఇస్తాడు ఎన్టీఆర్. ఈ పుస్తకం రాసేందుకు ప్రతి రోజూ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి వెళ్తూ ఆయనకు బాగా దగ్గరవుతుంది లక్ష్మీపార్వతి. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకుంటాడు. కానీ కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. అయినా ఎన్టీఆర్ లక్ష్మిని పెళ్లాడతాడు. తర్వాత 94 ఎన్నికల్లో విజయం కూడా సాధిస్తాడు. ఈ స్థితిలో ఎన్టీఆర్ను గద్దె దింపడానికి నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు.. తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కథ.

lakshmis-ntr-telugu-movie-review-rating

అలజడి విశ్లేషణ:

లక్ష్మీపార్వతితో వివాహం.. చంద్రబాబు వెన్నుపోటు.. మరణం.. ఈ ఉదంతాలు లేకుండా ఎన్టీఆర్ జీవితాన్ని చూపిస్తే అది అసమగ్రమే అవుతుంది. ఐతే నందమూరి బాలకృష్ణ-క్రిష్ టీం ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకమ్మ కోణంలో ఎన్టీఆర్ జీవితాన్ని చెప్పే ప్రయత్నం చేసి.. ఆమె మరణం దగ్గర కథను ఆపేయడంతో ఆ కథ ఎటూ కాకుండా పోయింది. ఎన్టీఆర్ జీవితాన్ని ఫ్లాట్ గా చూపించడం పైగా చంద్రబాబు పాత్రను పూర్తి పాజిటివ్ గా చూపడంతో ‘యన్.టి.ఆర్’ ప్రేక్షకులకు రుచించలేదు. ఐతే ఎన్టీఆర్ జీవితంలోని అతి ముఖ్యమైన.. చరిత్రలో మరుగున పడిపోయిన ఘట్టాలే ప్రధానంగా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ‘యన్.టి.ఆర్’ సినిమాకు కొనసాగింపుగా చెప్పొచ్చు. ‘యన్.టి.ఆర్’ కథ ఎక్కడైతే ఆగిందో దానికి కొంచెం ముందుకు వెళ్లి.. అక్కడి నుంచి ఎన్టీఆర్ జీవిత చరమాంకం వరకు ఇందులో చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య-క్రిష్ మధ్యలో వదిలేసిన కథను వర్మ తీసుకుని.. దానికి ఒక ముగింపు ఇచ్చాడని చెప్పొచ్చు. క్

ఎన్టీఆర్‌లాంటి ప్రజానేత చనిపోయినపుడు ఆయన ఆత్మ కూడా ‘లక్ష్మీ క్షమించు’ అన్నట్టుగా ఘోషిస్తున్నట్టు పాట పెట్టడం ఇందులోని అతికి పరాకాష్ట. లక్ష్మీపార్వతిపై విపరీతమైన సింపతీ వచ్చేటట్టుగా లాస్ట్‌ సీన్‌లో ఆమెని అంతా వెనక్కి తోసేసి, గుంపు వెనకగా వెళ్లి పడిపోయినట్టు చూపించడం లాంటి అతి చేష్టలు సినిమా నిండా కోకొల్లలు. ఎన్టీఆర్‌తో పాటు వుండాలని, ఆమె పాద సేవ చేసుకోవాలని తప్ప లక్ష్మీపార్వతికి మరో ఉద్దేశం లేదని, ఆమెని అన్యాయంగా ఎన్టీఆర్‌ కుటుంబం, చంద్రబాబు చాలా బాధించారని చిత్రీకరించారు. పూర్తిగా చంద్రబాబు బద్ధ విరోధులకి తప్ప వర్మ టేక్‌ ఆన్‌ లక్ష్మీపార్వతి ఎపిసోడ్‌ ఎవరినీ కన్విన్స్‌ చేయదు.దానికితోడు నాటకాన్ని తలపించే అభినయాలు, పాత్రధారులు ఈ చిత్రానికి సీరియస్‌నెస్‌ తీసుకురారు. పాటలే అక్కర్లేని ఈ చిత్రంలోకి అన్ని పాటలెందుకనేది వర్మకే తెలియాలి. పోనీ ఆ పాటలు వినసొంపుగా వున్నాయా అంటే అదీ లేదు. ఇటీవల అచ్చమైన కమర్షియల్‌ చిత్రాల్లో కూడా ఇన్ని పాటలుండడం లేదు. నేపథ్య సంగీతం వర్మ రెగ్యులర్‌ సినిమాల మాదిరిగా అవసరానికి మించిన ధ్వనితో ఇబ్బంది పెడుతుంది. నటీనటుల పరంగా చంద్రబాబుగా నటించిన శ్రీతేజ్‌ మెప్పించాడు. ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతి పాత్రధారులు మరింత కన్విన్సింగ్‌గా వుండాల్సింది.

రామారావు, లక్ష్మీపార్వతి మినహా ఎవరికీ అసలు పేర్లు పెట్టకపోయినా, వారిని ఎక్కడా పిలవకపోయినా చూడగానే వీరు ఫలానా అని గుర్తించేలా వారి వేష భాషలపై వర్మ తీసుకున్న శ్రద్ధ మాత్రం మెచ్చుకోతగింది. అయితే ఆహార్యం మినహా వారిలో చాలామంది ఆకట్టుకునేలా అభినయించలేక ఒక వీధి నాటకం లేదా ఏదో పేరడీ ఘట్టం చూస్తోన్న అనుభూతి కలిగించారు. ఇంటర్వెల్‌ తర్వాత వైస్రాయ్‌ ఘటన వరకు ఆసక్తికరంగానే నడిచిన ఈ చిత్రంలో ప్రథమార్థంలో ఎన్టీఆర్‌-లక్ష్మీల అనుబంధాన్ని కానీ, చివర్లో వచ్చే మోతాదు మించిన మెలోడ్రామాని కానీ భరించడం చాలా కష్టం. ఉన్నట్టుండి ఏడు పదుల వయసున్న ఎన్టీఆర్‌ తన భార్య లక్ష్మీపార్వతితో డాన్స్‌ చేసే సీన్‌ చూస్తే వర్మ ఈ చిత్రాన్ని ఆయనపై అభిమానంతో తీసాడా లేక ఆయన అభిమానులపై విరోధంతో తీసాడా అనిపిస్తే అది మీ తప్పు కాదు.

నటీనటుల

ఈ సినిమా కోసం వర్మ ఎంచుకున్న ప్రధాన పాత్రదారులంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే. ముఖ్యంగా ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించిన విజయ్ కుమార్‌ అయితే సినీరంగానికే కొత్త. రంగస్థల నటుడిగా ఉన్న విజయ్‌ కుమార్‌ను ఎన్టీఆర్‌ లాంటి పాత్రకు ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే వర్మ తన మీద పెట్టుకున్న నమ్మకానికి విజయ్‌ కుమార్‌ పూర్తి న్యాయం చేశాడు. ఎన్టీఆర్‌ హావభావాలను, డైలాగ్ డెలివరినీ చాలా బాగా తెర మీద చూపించాడు. మరో కీలక పాత్రలో నటించిన యజ్ఞశెట్టి నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది. నిష్కల్మశమైన ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం ఇలా అన్ని భావాలను తెరమీద అద్భుతంగా పలికించారు యజ్ఞ. బాబు రావు పాత్రలో శ్రీతేజ్ జీవించాడనే చెప్పాలి. కుళ్లు, కుతంత్రం, వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా శ్రీ తేజ్‌ నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రలో అంతా కొత్తవారే కనిపించిన ఎవరికి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్ :

  • కథా కథనాలు
  • ఎమోషనల్ సీన్స్‌

మైనస్ పాయింట్స్ :

  • నిదానంగా సాగే స‌న్నివేశాలు

పంచ్ లైన్:  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వర్మ ‘పోటు’ దిగలేదు

రేటింగ్ :  2.0/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)