Home / General / మాతృ దినోత్సవం(Happy Mothers Day) నిజంగా ఆంతా హప్పీయేనా…. అయితే ఈమే కధ చదవండి

మాతృ దినోత్సవం(Happy Mothers Day) నిజంగా ఆంతా హప్పీయేనా…. అయితే ఈమే కధ చదవండి

Author:

పెళ్ళై.., నాలుగు నెల‌ల త‌ర్వాత పుట్టింటికొచ్చిన న‌న్ను చూసి మా అమ్మ తెగ సంతోషప‌డిపోతోంది.! ఆ సంతోషంతోనే న‌న్ను గుండెల‌కు హ‌త్తుకుంటూ…

“చాలా లావ‌య్యావు … ముఖం కూడా వెలిగిపోతోంది…అంటే అల్లుడు నిన్ను రాణిలాగా చూసుకుంటున్నాడ‌న్న‌మాట‌”.! అనింది. ఆమె సంతోషాన్ని చెడ‌గొట్ట‌డం ఇష్టంలేని నేను అవునూ అన‌ట్టు త‌లూపాను.! ఎలా చెప్ప‌గ‌ల‌ను…

పెళ్లి చేసుకొని తీసుకెళ్లిన ఒక వారం లో… నా భ‌ర్త న‌న్ను 40 వేల‌కు బ్రోత‌ల్ హౌస్ లో అమ్మేశాడ‌ని..? ఎలా చెప్ప‌గ‌ల‌ను…నన్ను చూసుకోడానికి ఇప్పుడు ఒక్క అల్లుడు కాదు…చాలామంది అల్లుళ్లు ఉన్నార‌ని?తిరిగి ఇంటికెళ్లి…బ‌త‌క‌డ‌మే క‌ష్ట‌మైన నా త‌ల్లికి భారం అవ్వాల‌నుకోలేదు.! ఆ వేశ్యాగృహంలో నా ఉద్యోగం ఏంటో అర్థం చేసుకోడానికి నాకు వారం ప‌ట్టింది.

Happy-Mothers-day-real-story

అప్ప‌టి నుండి ఈ న‌ర‌కాన్ని మౌనంగా భ‌రించ‌డం అల‌వాటు చేసుకున్నాను. కాల్చిన సిగ‌రెట్ నా ఒంటిమీద చేసిన గుర్తులకు, నా దేహాంలోకి దిగిన పంటి గాట్ల‌కు, ర‌క్త‌మోడుతున్న నా ఆడ‌త‌నానికి తెలుసు…
నా ఆర్త‌నాదాలు.! నా నిద్ర‌లేని రాత్రులు.!!అలా సంపాధించిన డ‌బ్బును అమ్మ‌కిచ్చాను. అల్లుడిచ్చాడా..? అంతులేని న‌మ్మ‌కంతో అడిగింది అమ్మ‌.! ఆ… అవును…అల్లుళ్లు… (బ‌హువ‌చ‌నం) అని నాలో నేను అనుకున్నాను. నా పాపిస్టి జీవితం గురించి చెప్ప‌డం ఇష్టంలేక‌.!!

ఆమ్మ‌ వండింది తిన‌డం, ఆమె ఒడిలో నిద్ర‌పోవ‌డం…. ఇలా రెండు రోజులు అమ్మ‌తో హ్యాపీగా గ‌డిపాను.! నేను వెళ్లాల్సిన టైమ్ అయ్యింద‌ని బ‌య‌లు దేరుతున్న నా చేతిలో పిండి వంట‌లు పెట్టి….

“నీ భ‌ర్త‌కు తినిపించ‌మ్మా”…అంది అమ్మ‌..!! హా తినిపిస్తాను..ఈ రోజు రాత్రి నా ద‌గ్గ‌ర‌కొచ్చే భ‌ర్త‌లంద‌రికీ…. అంటూ నాలో నేను గొనుక్కుంటూనే బ‌య‌లు దేరాను.!! దేవుడు వేశ్య‌ల ప్రార్థ‌న‌లు వింటాడో లేదో తెలియ‌దు. కానీ వింటే…నా త‌ల్లి సంతోషంగా ఉంటే చాల‌ని కోరుకుంటా…నా గురించి కోరుకోడానికేం మిగిలిలేదు క‌దా.!దారి మళ్ళిన నా జీవితం.! అమ్మకు చెప్పలేను – బాధపెట్టలేను.

(Visited 1 times, 1 visits today)