Home / Latest Alajadi / ఒకే ఒక క్లిక్ తో మీ రైతు బంధు డబ్బుల స్టేటస్ తెలుసుకోవచ్చు.

ఒకే ఒక క్లిక్ తో మీ రైతు బంధు డబ్బుల స్టేటస్ తెలుసుకోవచ్చు.

Author:

తెలంగాణ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కి రైతులకు అందాల్సిన రైతుబంధు పథకం డబ్బులను విడుదల చేసింది. ఈ సంవత్సరం రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమకానున్నాయి. అందరికి ఒకే సారి కాకుండా రోజుకు కొంత మందికి చొప్పున డబ్బులు అకౌంట్ లలో పడుతుండడంతో, డబ్బులు రాని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని గురించి అధికారులకు కూడా సరైన అవగాహణ లేకపోవడంతో వారు రైతులకు సరైన వివరణ ఇవ్వలేకపోతున్నరు. ప్రభుత్వం మాత్రం అందరికి రైతు బంధు పథకం డబ్బులు అందుతాయని చెబుతుంది.

మీ భూమికి రావల్సిన రైతు బంధు డబ్బుల స్టేటస్ ను ఈ విధంగా తెలుసుకోవచ్చు. మొదటగా కింద ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం వారి ఖజానా శాఖ కు చెందిన e-Kuber schemes లింక్ క్లిక్ చెయ్యండి.

https://treasury.telangana.gov.in/index1.php?service=allschemes&fbclid=IwAR2lG40n7fAxl8ze387oyEHa0tZRg8-Z84yPQ_RE6EutLUMQUYIEenyqXq4

ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తరువాత సంవత్సరం పై క్లిక్ చేసి 2019-2020 సెలెక్ట్ చేసుకోండి. ఆ తరువాత టైప్ అని ఉన్న దాంట్లో రైతు బంధు ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. ఆ తరువాత మీ పాస్ బుక్కు నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కండి. ఆ తరువాత మీ డబ్బులు స్టేటస్ చూపిస్తుంది. మీ డబ్బులు మీ అకౌంట్ లో క్రెడిట్ అయ్యాయా? అయితే ఆ అకౌంట్ నంబర్ లేదా ఇంక కొంత కాలం వెయిట్ చెయ్యాల? అన్న మెసేజీ చూపెడుతుంది . మీ అకౌంట్ కి సంబందించిన ఎమైన సమస్యలు ఉంటే కూడా అక్కడ చూపెడుతుంది. మీకు అక్కద ఏ సమచారం చూపించిక పొతే వెంటనే మీ మండల వ్యవసాయాధికారిని కలిసి మీ పరిస్తితి వివరించండి. వారు మీకు సహాయం చేస్తారు. ఈ విషయాన్ని మీ తోటి రైతులకు తెలిపి వారిని అందోళనకు గురి కావోద్దని సూచించండి.

15 రోజులు క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టుని పూర్తిగా నల్లగా మార్చే అద్భుతమైన పద్ధతి.

(Visited 1 times, 1 visits today)