Home / Entertainment / బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్ గ్రాండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!

బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్ గ్రాండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!

Author:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన రియాలిటీషో బిగ్ బాస్ మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు, బిగ్ బాస్ రెండో సీజన్ కి నాని హోస్ట్ చేస్తున్నాడు, మొదట్లో కొంచెం మాములుగా సాగిన షో రోజురోజుకి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది, సభ్యుల పెర్ఫార్మన్స్ తో పాటు ప్రతి శని, ఆది వారాలలో నాని యాంకరింగ్ తో బిగ్ బాస్ షోని రక్తి కట్టిస్తున్నారు, 16 మంది కంటెస్టెంట్స్‌, 100 రోజులు, 90 కెమెరాలు, ఒక్క బిగ్ బాస్ హౌజ్‌ గా డిజైన్ చేసిన ఈ షో నుండి ఇప్పటికే 5 సభ్యులు ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ లోకి యాంకర్ ప్రదీప్

ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌస్ లో 12మంది స‌భ్యులు ఉన్నారు. కొద్ది రోజుల నుండి కుమారి 24ఎఫ్ సినిమా హీరోయిన్ హెబ్బా ప‌టేల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాని అంద‌రి ఆలోచ‌న‌ల‌ని త‌ల‌కిందులు చేస్తూ స్టార్ యాంక‌ర్ ప్ర‌దీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి వెళ్లారు. ఆయన ఎంట్రీ ఇంటి స‌భ్యుల‌తో పాటు అందరికి షాకింగ్‌గా మారింది. ప్ర‌దీప్‌ని బిగ్ బాస్ హౌస్ లో చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అయ్యారు. మిమ్మ‌ల్ని ఒక్క వారంలోనే ఇంటికి పంపిస్తామంటూ హౌజ్‌మేట్స్ చ‌మ‌త్కారం చేశారు. తాజాగా ప్ర‌దీప్ ఎంట్రీకి సంబంధించి ప్రోమో వీడియో విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌దీప్ ర‌చ్చ మాములుగా లేదు. బుల్లి తెరలో ఎక్కువ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే యాంకర్ ప్రదీప్ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక సభ్యుడిగా వెళ్లాడా లేక గెస్ట్ గా వెళ్లాడా ..? అనేది ఈరోజు షో చూస్తేనే తెలుస్తుంది.

(Visited 1 times, 1 visits today)