Home / Inspiring Stories / ప్రపంచం కోసం ఆలోచించి 12 ఏళ్ళ చిన్నారి ఈ ప్రయోగం చేసింది

ప్రపంచం కోసం ఆలోచించి 12 ఏళ్ళ చిన్నారి ఈ ప్రయోగం చేసింది

Author:

Nasik

నాసిక్ కు చెందిన సృష్టి నేర్కర్ వయసు 12 ఏళ్ళు ఆరవతరగతి చదువుతోంది. ఒకరోజు తన క్లాసులో పాటం చెబుతూ వాళ్ళ టీచర్ చెప్పిన మాటలు ఆ అమ్మాయిని ఆలోచించేలా చేసాయి. మానవుడికి నీరనేది ఎంత అవసరమో. పనికి వచ్చేనీటి నిల్వలు ఎంత తగ్గిపోతున్నాయో చెబుతూ… “మనం ఇలా నీటిని వృధా చేస్తూ పోతే ఇప్పుడు పెట్రోల్ కోసం జరిగే యుద్దాలు, ఇక ముందు నీళ్ళ కోసం జరుగుతాయి” అన్న టీచర్ మాటలు సృష్టి మనసులో ఒక ఆలోచనను రేపాయి. “నీరు వృధా ఆపటం ఎలా?” అనే ఆలోచన అమె మనసులో మెదులుతూనే ఉంది.

ఒకరోజు తమ కారుని సర్వీస్ సెంటర్ కి తీసుకు వెళ్తూన్న వాళ్ళ నాన్నతో పాటు తానూ వెళ్ళింది. ఒక్కొక్క కారునే కడగటం చూస్తూంటే తనకో ఆలోచన వచ్చింది “ఒక్క కారు కడగటానికి ఎన్ని నీళ్ళు అవసరమౌటాయి?” అలా ఒక రోజుకి పది కారులను కడిగినా ఎన్ని లీటర్ల నీళ్ళు వృదా ఔతున్నాయి అనిపించిన ఆ చిన్నరి ప్రశ్నకు ఆ సర్వీస్ సెంటర్ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా..? రెండు లీటర్లు ఔను ఒక్కోకారు కడగటానికి కేవలం రెండు లీటర్ల నీళ్ళు మాత్రమే సరిపోతాయి… అన్న సమాధానం తనకు వింతగా అనిపించింది “అదేలా అంత పెద్ద కారుని కడగటానికి రెండు లీటర్లు సరిపోతాయా?” మరోప్రశ్న. “మేం స్ప్రింక్లర్లు వాడుతాం.. అందువ‌ల్ల కాసిని నీళ్ల‌యినా స‌రిపోతాయి అన్నారు. నాజిల్స్ నుంచి వేగంగా జళ్ళు లా వచ్చేనీళ్ళు తక్కువైనా పూర్తి కారుని శుభ్రం చేస్తాయి”.

రెండు లీట‌ర్ల నీళ్ల‌తో ఒక కారునే పూర్తిగా శుభ్రంగా వాష్ చేయ‌గ‌లిగిన‌ప్పుడు- మ‌నం రోజూ స్నానానికి వాడే నీళ్ల‌ను అంత‌కంటే త‌గ్గించ‌లేమా? ఈ లాజిక్ ద‌గ్గ‌ర సృష్టి ఆలోచ‌న‌లు గింగిరాలు కొట్టాయి. మామూలుగా స్నానానికి కనీసం 20 లీటర్ల నీటిని వాడే మనిషి షవర్ తో స్నానం చేస్తే మాత్రం దాదాపు 80 లీటర్ల నీళ్లు ఖ‌ర్చ‌వుతాయి. ఈ వృధాను అరిక‌ట్టాలంటే..? కార్ వాష్ చేయ‌డానికి వాడే నాజిల్స్ కంటే ఇంకా సన్నటి నాజిల్స్ వాడి ష‌వ‌ర్ త‌యారు చేస్తే..!! సృష్టి ఇదే ఆలోచన ని అక్కడే ఆపేయలేదు. 12 ఏళ్ళ చిన్ని బుర్రలో ఒక ప్లాన్ రూపుదిద్దుకుంది వెంటనే పనిలోకి దిగింది. ఐతే ఒక్క‌సారికే ప్రయోగం స‌క్సెస్ కాలేదు. నాలుగుసార్లు ఫయిలయ్యాక ఐదోసారి విజ‌య‌వంత‌మైంది. ఆమె చేసిన ప్ర‌యోగం వ‌ల్ల- ఒక‌సారి స్నానం చేస్తే కేవలం 15 లీటర్ల నీరే ఖర్చవుతాయి అంటే ఏకంగా 65 లీట‌ర్ల నీరు ఆదా అవుతుంది. . అలాగే తమ వాహనాలను క్లీన్ చేయడానికి ఈ స్పింకర్లను ఉపయోగించి వాటర్ ను సేవ్ చేయవచ్చు. ఈ పద్ధతిని ఉపయోగించి 17 లక్షల మంది జనాభాకు 34 రోజుల పాటు ఇలా నీటిని పంపిణీ చేయవచ్చు. బుల్లి ఇన్వెంటర్ గా పేరు తెచ్చుకున్న సృష్టి ప్రతిభను గుర్తించిన జిల్లా కలెక్టర్ దిపేందర్ సింగ్, ఆ పరికర పేటెంట్ హక్కులను సృష్టికేనని తెలిపారు….

(Visited 851 times, 1 visits today)