Home / Inspiring Stories / బ్యాగులో బాంబుందంటూ బెంబేలెత్తించిన స్కూలు విధ్యార్థి.

బ్యాగులో బాంబుందంటూ బెంబేలెత్తించిన స్కూలు విధ్యార్థి.

Author:

Armaan Singh Sarai

ఇప్పుడు ప్రపంచమంతా బాంబు పేలుడు,తుపాకీ కాల్పులూ అన్నమాట వింటూనే వణికిపోతున్నారు. చిన్న అనుమానం వచ్చినా ఏమాత్రం చాన్స్ తీస్కోవటం లేదు,కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా చూపట్లేదు. ముఖ్యంగా అమెరికా,యూరప్ దేశాల ప్రజల్లో ఒక రకమైన భయం కూడా నెలకొంటోందని,ఇది కొన్ని సార్లు మాస్ హిస్టీరియాలకూ దారి తీయొచ్చనీ అంటున్నారు మానసిక నిపుణులు.. ప్యారిస్ లో కాల్పులు మరవకముందే అమెరికా లోని క్రిస్మస్ పార్టీలో జరిగిన మరో దుర్ఘటన ఇలా వరుసగా జరుగుతూండటం తో కొన్ని వేడుకలంటేనే తెలియని భయం పుడుతోందట పాశ్చాత్య దేశాల ప్రజల్లో. దాంతో ఎక్కడ ఏచిన్న అనుమానం కలిగించే విశయం కనిపించినా వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు ప్రజలు. ఈ నేపథ్యం లో ఒక టీనేజర్ ప్రాక్టికల్ జోక్ కాస్తా అతన్ని కటకటాల వెనక్కి తోసింది. అతను భారత సంతతికి చెందిన వాడు కూడా కావటంతో అసలే ఆసియ దేశాలంటేనే అనుమానంతో ఉన్న పోలీసులకు అతని పై మరింత అనుమానం కలిగింది.,

అసలు ఏం జరిగిందంటే.. టెక్సాస్ లో అర్మాన్ సింగ్ సరాయ్ అనే భారత సంతతి కి చెందిన పన్నేండేళ్ల బాలుడు తాను చదువుతున్న నికోలస్ జూనియర్ హైస్కూల్ లో ఓ క్లాస్ మేట్ తో తన బ్యాగులో బాంబు ఉందని అన్నాడు. ఐతే అదికేవలం ఒక ప్రాక్టికల్ జోక్ ప్లేచేద్దామన్న ఉద్దేశం తోనే. ఐతే సదరు సహ విధ్యార్థిని ఆమాట ప్రిన్సిపల్ కి చెప్పేసింది. ఇంకేముందీ..! కాలేజీ ప్రిన్సిపాల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా అసలు పన్నేడేళ్ళ కుర్రాడి దగ్గర నిజంగా బాంబు ఉందా లేదా అని చూడకుండానే నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అసలు పోలీస్లు వచ్చే వరకూ అర్మాన్ ఉన్న గదిలోని పిల్లలని అతనికి తెలియకుండా ఒక్క్కొక్కరినే బయటకు రప్పించేస్తూన్నాడు కూడా. అక్కడికి చేరుకున్నపోలీసులు వెంటనే ఆర్మాన్ ని చుట్టుముట్టి అతని బ్యాగ్ ని సోదాచేసి ఏమీ కనైపించకపోయేటప్పటికి నేరుగా జువైనల్ హోం కి తరలించేసారు. మూడు రోజుల పాటు జైలులో ఉంచి వదిలివేశారు. ఐతే ఆర్మాన్ తల్లిదండ్రులకు అతడి అరెస్టు గురించి తెలియనే తెలియదు.ఆరోజు స్కూల్ నుంచి ఇంకా రాలేదేంటి అని కంగారు పడిపోయి పోలీసులకు ఫిర్యాదుచేయగా ఎంక్వైరీ చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేసి జువెనైల్ అధికారులు సమక్షంలో ఉంచినట్లు తెలిపారు. ముందు నుంచీ అర్మాన్ అల్లరి వాడే అయినా. ఇలాంటి విషయంలో తాను ఏమాత్రం చాన్స్ తీసుకోలేకపోయాననీ. ప్రతీవారినీ అనుమానించే పరిస్థితిలో  ఉన్న తాను అర్మాన్ మాటలని నమ్మాలో వద్దో అనే చిన్న స్థాయి నిర్లక్ష్యాన్ని చూపించలేకపోయాననీ ప్రిన్సిపాల్ చెప్పాడట. ఈ విషయాన్ని అతడి సోదరి ఫేస్ బుక్‌ లో పోస్ట్  చేయటంతో మనోడి కోతిపనిని చాలా మందే షేర్ చేసుకుంటున్నారటకూడా…

(Visited 91 times, 1 visits today)