Home / Inspiring Stories / 12000 మంది పరీక్ష రాస్తే 20,000 మంది పాసయ్యారట.

12000 మంది పరీక్ష రాస్తే 20,000 మంది పాసయ్యారట.

Author:

exams 12000 students appeared in exams then 20000 students passed the exams

బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి విద్యా సెషన్ 2013-14 లో బీఈడీ పరీక్ష రాసిన విధ్యార్థుల ఫలితాలు సిద్దమయ్యాయి ఇక ఆ ఫలితాలను వెల్లడించేముందు ఒక చిన్న విషయం అధికారులను షాక్ కు గురి చేసింది ఇంతకీ ఆ “చిన్న” విషయం ఏమిటంటే..! 12000 మంది పరీక్ష రాస్తే 2000 మంది పాస్ అయ్యారట… అదేమరీ మరీ ఇంతగా పెరిగిన ఉత్తీర్ణతా రేటుని చూసి వాళ్ళకి కళ్ళు తిరిగాయి.

యూనివర్సిటీ వీసీ వెంతనే విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారం కొలిక్కి వస్తే అనేకమంది ప్రైవేటు కాలేజీల యజమానులు జైలుకెళ్ళాల్సి వస్తుంది.వర్సిటీ ప్రతినిధి ప్రొఫెసర్ మనోజ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ దీనిపై వీసీ మొహమ్మద్ ముజమ్మిల్ ఈ విశయం పై ఒక విచారణ కమిటీని వేసినట్టు చెప్పారు. 12,800 విద్యార్థులు ఉంటే 20083 మంది ఉత్తీర్ణులైనట్టు వచ్చిన ఫలితాల పట్ల ప్రైవేటు కళాశాలలో జరిగిన అవకతవకలే కారణం అనిభావిస్తున్నట్టు ఆయన చెప్పారు.బీఈడీ ఫలితాలు సిద్దమౌతున్నప్పుడు మొత్తం ఉన్న విధ్యార్థుల సంఖ్య కంటే అదిక మొత్తంలో విధ్యార్థులున్న సంగతి మా దృష్టికి వచ్చింది. మా తనిఖి లో అదికంగా ఉన్న అభ్యర్థులందరూ ప్రైవేటు స్టడీ సెంటర్ల నుంచి వచ్చినవారే.మొదట్లో ఉన్న సీట్ల పరిమితికి మించి విధ్యార్థులను చేర్చుకున్న విధ్యార్థులను కూడా పరీక్షకు సిద్దం చేసారనీ ఐతే వచ్చిన అభ్యర్థులందరూ పరీక్షలలో ఉత్తీర్ణులైనా వారు అర్హులు అవుతారా కాదా అన్నది ఇప్పుడున్న సమస్య. వారు ఏరకంగానూ అర్హులుకారు అని ఆయన స్పష్టం చేసారు.

2013-14 ( పరీక్షలకు ఇది కోసం 2014-15 లో జరిగాయి ) విద్యా సెషన్ లో,191 బీఈడీ కళాశాలల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేటు కళాశాలల్లో 40% సీట్లు ఖాళీగా నే ఉండిపోయాయి ఐతే ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు గానూ ఆ సీట్ల స్తానంలో ఈ సంవత్సరం మరికొంతమంది అభ్యర్థులను కలిపేసి పరీక్షలు రాయించారు. దీని కోసం గానూ ఒకరోజు ముందు కూడా అభ్యర్థులను చేర్చుకొని పరీక్షలకు పంపారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం పరీక్ష ఉత్తీర్ణత విద్యార్థులు వ్యక్తిగత డేటాలను సమర్పించాల్సిందిగా కోరింది. వర్సిటీ అధికారులు కూడా బీఈడీ ప్రవేశ పరీక్షలో కనపడే విద్యార్థుల కౌన్సిలింగ్ సెషన్స్ వీడియో సీడీ లను సమర్పించాల్సింది గా ప్రైవేటు కళాశాలలకు నోటీసులిచ్చారు..

(Visited 665 times, 1 visits today)