Home / Inspiring Stories / పదమూడేళ్ళకే ప్రాణాలు కాపాడే యంత్ర ఆవిష్కరణ చేసిన విద్యార్ధి

పదమూడేళ్ళకే ప్రాణాలు కాపాడే యంత్ర ఆవిష్కరణ చేసిన విద్యార్ధి

Author:

Jayakumar-Superb-work-by-a-class-nine-student-in-saving-the-lives-of-many-fireworks-factory-workers2

తమిళనాడు లోని శివకాశి బాణాసంచా తయారీ కి ప్రపంచ వ్యాప్తంగా పేరున్న స్థలం. భారతదేశం లోని 90% బాణాసంచా ఇక్కడే తయారవుతుంది. అగ్గిపెట్టెల కర్మాగారాలూ తక్కువేం కాదు. అయితే ఇక్కడ కార్మికుల కు మాత్రం ఈ బాణా సంచాతయారీ ప్రమాదకరమే. ఒక్క చిన్న పొరపాటు చాలు పదుల సంఖ్యలో ప్రాణాలు పోవటానికి. ఇక్కడ జరిగిన పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వందల్లో ఉంది. చిన్న రాపిడి,పేలుడు పథార్థాల మద్య ఒత్తిడి,ఉష్ణోగ్రతల్లో మార్పు ఇలా ఏ ఒక్క దానిలో తేడావచ్చినా అక్కడ పెను విధ్వంసం తప్పదు… అయితే ఈ సమస్యకి ఇప్పుడు ఒక పరిష్కారం దొరికింది. ఉష్ణోగ్రతలో మార్పుని పసిగట్టి ఏమాత్రం మంటలు చెలరేగినా వెంటనే పసిగట్టి మంటలను అదుపు చేసే అత్యద్బుతమైన ఆవిష్కారం జరిగింది. అయితే దీన్ని తయారు చేసింది ఏ పెద్ద శాస్త్రవేత్తో,మరే పరిశోదకుడో కాదు ఒక తొమ్మిదో తరగతి పిల్లవాడు….

ఒకప్పుడు బాణాసంచా తయారీ కేంద్రంలో తనతల్లి ప్రమాదం లో చిక్కుకుంది కానీ అదృష్టవశాత్తూ ఆమె బతికి బయటపడింది. అప్పుడే 10ఏళ్ళ జయకుమార్ మనసులో ఈ మంటలనార్పే యంత్రం సృష్టికి భీజం పడింది. రెండేళ్ళుగా తన సైన్స్ టీచర్ కరుణై దాస్ తో కలిసి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సెన్సార్ల సహాయంతో ఉష్ణోగ్రతని కనిపెట్టి మంటలను అదుపు చేసే టెక్నాలజీకి రూపకల్పన చేసాడు. ఒత్తిడి,రాపిడి జరిగినప్పుడు పుట్టే ఉష్ణోగ్రతని గుర్తించి అత్యల్ప కాలంలోనే మంటలు పుట్టే ప్రదేశాన్ని కనిపెట్టి మంటలనార్పే పరికరాన్ని తయారు చేసాడు.అదీ తన పదమూడేళ్ళ వయస్సులోనే.. సెన్సార్ల సాయంతో ఉష్ణోగ్రతని కనిపెట్టిన వెంటనే ఈ పరికరానికి కనెక్ట్ చేయబడ్డ అలారంని ఆక్టివేట్ చేస్తుంది. ఆనికి అనుసంధానం గా ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి చిమ్మే నీరు నిర్దేశిత ప్రదేశం లో జల్లులుగా చిమ్మి అక్కడ మంటలను అదుపు చేస్తుంది…

Jayakumar-work-by-a-class-nine-student-in-saving-the-lives-of-many-fireworks-factory-workers

ఈ ఫిబ్రవరి 27న జరిగిన ఒక వైఙ్ఞానిక సదస్సులో జయ కుమార్ తన పరిశోదనని వివరిస్తూ ఒక డెమో కూడా ఇచ్చాడు. అది పని చేసే విధానాన్ని ఒక కార్డ్ బోర్డ్ తో చేసిన ఫ్యాక్టరీ నమూనాతో వివరించాడు. 13 ఏళ్ళ జయ కుమార్ కి ఇలాంటివి చేయటం ఇదే మొదటిసారేం కాదు. ఇదివరలోనే ఎల్పీజీ గ్యాస్ లీకైనప్పుడు గుర్తించి హెచ్చరించే సిస్టంని కూడా కనిపెట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇప్పుడు తన టీచర్ కరుణై దాస్ తో కలిసి కొత్త ప్రాజెక్ట్ కి మరిన్ని మెరుగులు దిద్ది,పెద్దేత్తున అలాంటి పరికరాలను ఉత్పత్తి చేసే ఆలోచనలో ఉన్నాడట జయకుమార్….

(Visited 764 times, 1 visits today)