Home / Inspiring Stories / అమ్మాయిల జోలికొస్తే ఇక చెప్పు దెబ్బ కాదు…చావు దెబ్బే

అమ్మాయిల జోలికొస్తే ఇక చెప్పు దెబ్బ కాదు…చావు దెబ్బే

Author:

ప్రతీ రోజు పేపర్లో, టీవీలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు సంబంధించిన వార్తలు కనపడుతూనే ఉంటాయి. అసలీ , దేశానికేమైంది .. ఒక వైపు అత్యాచారం, మరో వైపు యాసిడ్ దాడి అన్నట్టు తయారైంది మన దేశం. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది చిన్న, పెద్ద చివరికి ముసలి వాళ్ళని కూడా వేధిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అమ్మాయిలు బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఈ కామంధులు ఏ రకంగా ఎటాక్ చేస్తారో అని భయం. మారుతున్న పరిస్థితుల్లో ఆడామగా తేడా లేకుండా సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. పగలు రాత్రీ తేడా లేకుండా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో పోటీ పడి పని చేస్తున్నారు..జీవితంలో ఎదుగుతున్నారు. కానీ కాలంతో పాటు వారిపైన దాడులు కూడా పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు.

ఇలాంటి పరిస్థితులన్నీ గమనించిన హైదరాబాద్ కు చెందిన సిద్ధార్థ మండల అనే యువకుడు కామాంధులకు బుద్ది చెప్పెందుకో ఎలక్ట్రో షూ రూపొందించాడు. ఇవి మాములుగా మనం వేసుకునే హవాయి చెప్పుల్లానే ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకతలతో తయారుచేసాడు. ఈ చెప్పులకు రీ చార్జబుల్ బ్యాటరీతో పాటూ ఒక చిన్న సర్క్యూట్ ఏర్పాటు చేశాడు. ఈ చెప్పులు ధరించి నడుస్తే చాలు ఆటోమాటిక్ గా చెప్పుల బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. ఫుల్ చార్జ్ అయిన చెప్పుల్లో దాదాపు 0.1 ఆమ్పియర్ల విద్యుత్ నిలువ ఉంటుంది. మన జోలికి ఎవరైనా వచ్చినా, అత్య్యచార ప్రయత్నం చేసినా, దాడి చేసినా, ఈ చెప్పులతో వారికి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వొచ్చు. చెప్పు దెబ్బకు దాడి చేయబోయేవాడు షాక్ తగిలి గిలగిలలాడాల్సిందే. కుప్పకూలిపోవాలిసిందే. ఆ గ్యాప్ లో ఆ అమ్మాయి ప్రమాదం నుంచి బయటపడొచ్చు. పోలీసులకో లేదా కుటుంబ సభ్యులకో కాల్ చేసి అప్రమత్తం అవ్వొచ్చు. అయితే ఈ చెప్పులు షాక్ ఇవ్వాలంటే మాత్రం బ్యాటరీ ఫుల్ చార్జ్ అవ్వాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్ళే ఏర్పాటు కుడా ప్రత్యేకంగా చేసుకోవచ్చు అంటున్నాడు ఈ 17 ఏళ్ల సిద్ధార్థ.

electroshoe-for-women

ఒకసారి ఈ చెప్పులని ధరింఛి వాడడం మొదలుపెడితే దీని పనితీరు మరింత బాగా అర్థమవుతుందని ..ఆడవాళ్ళకు చాల రక్షణగా ఉంటుందని భరోసా ఇస్తున్నాడు సిద్ధార్థ. ఈ ఎలెక్ట్రో షూ పేటెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాడట. శభాష్ సిద్ధార్థ ..ఈ చెప్పులు తొందర్లోనే మార్కెట్ లోకి వచ్చి అమ్మాయిలకు రక్షణగా నిలవాలని, గాంధీ కోరుకున్న అసలైన స్వాతంత్రం అప్పుడే లభిస్తుందని అలజడి మనసారా కోరుకుంటోంది..

(Visited 907 times, 1 visits today)