Home / General / అదే పనిగా లైకులు కొట్టినందుకు రూ.2.58 ల‌క్ష‌ల జ‌రిమానా

అదే పనిగా లైకులు కొట్టినందుకు రూ.2.58 ల‌క్ష‌ల జ‌రిమానా

Author:

ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ ఉండటం సర్వసాధారణం అయిపోయింది. బెడ్ లోంచి లేచీ లేవగానే గుడ్ మార్నింగ్ అని ఫేస్ బుక్ లోనో, వాట్సాప్ లోనో మెసేజ్ పెట్టకుండా బెడ్ దిగట్లేదు. ఇక బ్రష్ చేస్తూ, టిఫిన్ చేస్తూ… ఎప్పటికీ చేతిలో మొబైల్ ఉండాల్సిందే.. ఏ రింగ్ టోన్ సౌండ్ వచ్చినా టక్కున మొబైల్ చెక్ చేసుకోవాల్సిందే. ఇదంతా ఓకే .. కానీ, తెలిసినా తెలియకపోయినా ఫేస్ బుక్ లో ఆడ్ చేస్కోవడం, కనబడ్డ ప్రతీ దానికీ లైకులు, కామెంట్లు పెట్టడం మాత్రం మంచిది కాదంటున్నారు సైబర్ నిపుణులు. ఏ ఇవన్నీ మామూలే నమ్మమంటారా? ఐతే ఇది చూడండి. అదే పనిగా లైకులు కొట్టినందుకు ఓ వ్య‌క్తికి ఏకంగా రూ.2.58 ల‌క్ష‌ల జ‌రిమానా వేశారు. ఇప్పుడైనా నమ్ముతారా….

fine for facebook like

అసలు విషయం ఏంటంటే, ఎర్విన్‌ కెస్లర్‌ అనే ఒకాయన ఫేస్ బుక్ లో జంతువుల హక్కుల గ్రూపును ర‌న్ చేస్తున్నాడు. అత‌ను పెట్టే పోస్టులు కొందరికి నచ్చుతాయి కొందరికి నచ్చావు. కొందరు బాగున్నాయని, కొందరు నచ్చలేదనీ కామెంట్లు పెడుతుంటారు. ఇలా ఒకతను పెట్టిన నెగెటివ్ కామెంట్ల‌ను స‌మ‌ర్థిస్తున్న‌ట్టుగా ఓ వ్య‌క్తి లైక్ కొట్టాడు. దీంతో అత‌నిపై ఎర్విన్‌ కెస్లర్‌ ఫిర్యాదు చేశాడు. కేసు కోర్టుకెళ్ళింది. కేసు విచారించిన జ‌డ్జి లైక్ కొట్టిన వ్య‌క్తిది పరువు నష్టం కలిగించే చ‌ర్య‌గా అభివ‌ర్ణించి, 2.58 ల‌క్ష‌ల రూపాయల జ‌రిమానా విధించారు. అంతేకాదు కెస్ల‌ర్ పై నెగెటివ్ కామెంట్లు పెట్టిన వారిని కూడా దోషులుగా నిర్ణ‌యించి శిక్ష వేసింది సదరు కోర్టు.

ఇప్పుడు అర్థమైందా.. ఏముందో కూడా చూడ‌కుండా పోస్టులకు ఎడాపెడా లైక్‌లు కొడితే జ‌రిగేదిదే. ఇకపై ఫేస్‌బుక్‌లో క‌నిపించిన ప్ర‌తి దానికి లైక్ కొట్ట‌డమో, కామెంట్ చేయడమో మానేయండి. నిజంగా లైక్ కొట్టాల‌నో, కామెంట్ పెట్టాల‌నో అనుకున్నా అందులో ఏముందో ఒకటికి రెండు సార్లు చెక్ చేస్కున్నాకే ఆ ప‌నిచేయండి. లేదంటే ఏదో కోర్టులో కేసు ఫైల్ అవడం. మీరు ఫైన్ కట్టడం తెలీకుండానే జరిగిపోతాయి. ఫేస్ బుక్కే కదా అనుకోకండి. పైనుంచి నిఘా ఒకటుంటుంది. మనం చేసే ప్రతి పనీ, చర్యా ఎవరిని కించపరచినా ఇబ్బందుకు తప్పవు. తస్మాత్ జాగ్రత్త.

(Visited 1,082 times, 1 visits today)