వాహనదారులకు శుభవార్త. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో చమురు సంస్థలు కూడా స్వల్పంగా ఇంధన ధరలను తగ్గించాయి. ఇంధన ధరల తగ్గింపు వరుసగా నాల్గవరోజైన సోమవారం కూడా కొనసాగింది. సోమవారం లీటరు పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 13పైసలను సంస్థలు తగ్గించాయి.
హైదరాబాద్‌లో శనివారం పెట్రోల్ ధర లీటర్‌కు 41 పైసలు, ఆదివారం 26 పైసలు, సోమవారం 11 పైసలు పెట్రోల్, డీజిల్ ధర కూడా 13పైసలు తగ్గింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.86.66గా ఉండగా.. డీజిల్ ధర రూ.81.94కి చేరింది.
విజయవాడలో శనివారం పెట్రోల్ ధర లీటర్‌కు 53 పైసలు, ఆదివారం 11 పైసలు, సోమవారం 11 పైసలు పెట్రోల్, డీజిల్ ధర కూడా 13పైసలు తగ్గింది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.11గా ఉండగా.. డీజిల్ ధర రూ.80.86కి తగ్గింది .
ఢిల్లీలో శనివారం పెట్రోల్ ధర లీటర్‌కు 40 పైసలు, ఆదివారం 20 పైసలు, సోమవారం 10 పైసలు పెట్రోల్, డీజిల్ ధర కూడా 12పైసలు తగ్గింది.
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.83, డీజిల్ రూ.75.69కు తగ్గింది .
ముంబైలో శనివారం పెట్రోల్ ధర లీటర్‌కు 58 పైసలు, ఆదివారం 25 పైసలు, సోమవారం 11 పైసలు పెట్రోల్, డీజిల్ ధర కూడా 13పైసలు తగ్గింది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.93 . డీజిల్ రూ.79.23గా తగ్గింది.
గమనిక : ఇవి BPCL వెబ్ సైట్ లో పేరొకొన వివరలు. సరఫరా కంపెనీలను, ప్రాంతాలను బట్టీ ధరల్లో కొద్దిగా తేడాలుంటాయి.