Home / Inspiring Stories / పెద్ద నోట్ల రద్దుతో కేవలం 500 రూపాయల ఖర్చుతో పెళ్లి చేసుకున్న జంట.

పెద్ద నోట్ల రద్దుతో కేవలం 500 రూపాయల ఖర్చుతో పెళ్లి చేసుకున్న జంట.

Author:

పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా చాలా పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. కొంతమంది పెళ్లి కార్డు ను చూపించి 2.50 లక్షల రూపాయలను వారి ఖాతా నుండి తీసుకుంటున్నారు. కొంత మంది ఉన్న డబ్బుతో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సూరత్ కు చెందిన ఒక జంట వారి పెళ్లిని కేవలం రూ. 500 ఖర్చుతో జరుపుకున్నారు.

a-couple-got-married-in-just-rs-500-1

ప్రధాని సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లోని సూరత్ లో భారత్ పర్మార్, దక్ష కు పెళ్ళి కి పెద్ద నోట్ల రద్దు ఒక సమస్యగా మారింది. వీరి పెళ్లిని అంగరంగ వైభవంగ జరుపాలని ఇరు కుటుంబాలు ప్లాన్ చేశాయి. కాని నోట్ల రద్దుతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దానితో చదువుకున్న వధూవరులు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి అనుకున్న ముహుర్తానికే నిరాడంబరంగా పెళ్ళి జరుపుకున్నారు. వీరి పెళ్ళికి ఖర్చు అయింది కేవలం 500 రూపాయలు అంటే ఎవరు నమ్మరు కానీ ఇదే నిజం. వచ్చిన అతిధులకు కేవలం 500 రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళికి వచ్చిన వారికి మంచి నీళ్లు, చాయ్ ఇచ్చి వారి నుండి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ విషయం గురించి వధూవరులు మాట్లాడుతూ… మా పెళ్లిని ఘనంగా చేసుకోవాలి అనుకున్నాం కానీ పెద్ద నోట్ల రద్దుతో చాలా కంగారుకు గురయ్యాం, కానీ ఆలోచిస్తే నిరాడంబరంగా పెళ్ళి చేసుకోవడమే మంచి మార్గం అనిపించింది. కొద్దిగా కష్టంగా ఉన్న తప్పదు కాబట్టి పెళ్ళికి వచ్చినవారికి టీ మాత్రమే ఇచ్చామన్నారు.

(Visited 936 times, 1 visits today)