Home / Inspiring Stories / ట్వీట్ కి స్పందించి ఊబకాయురాలుకి మెడికల్ వీసా ఇప్పించిన సుష్మా స్వరాజ్.

ట్వీట్ కి స్పందించి ఊబకాయురాలుకి మెడికల్ వీసా ఇప్పించిన సుష్మా స్వరాజ్.

Author:

భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ పనితనం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. అమే సోషల్ మీడియా ద్వార కూడా ఫిర్యాదులను స్వీకరించి భాదితులను ఆదుకున్న ఘటనలు అనేకం. అలాంటి సంఘటనే ఇంకోకటి జరిగింది. ఈజిప్ట్ దేశానికి చెందిన ఇమాన్ అహ్మ‌ద్ అబ్దులాటి అనే మహిళ అధిక బరువుతో బాధపడుతుంది. అమే ఇప్పటికే 500 కిలోల బరువు పెరిగి ఎటు కదలలేని పరిస్తితి కి చేరుకుంది. ఆమేకు చికిత్స చేయించాలని అమే కుటుంబ సభ్యులు ప్రపంచంలోని మంచి డాక్టర్లందరిని సంప్రదించి చివరకు ముంబాయి కి చెందిన డాక్ట‌ర్‌ ముఫ‌జ్జ‌ల్ ల‌ఖ్‌డావాలా దగ్గర చికిత్స చేయించాలని నిర్ణయించుకున్నారు. కాని ఇమాన్ కి వీసా కోసం ఈజిప్ట్ లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా వారు వీసా ఇవ్వాడానికి నిరాకరించారు. దానికి కరాణం భారత రాయబార కార్యాలయ నిబంధనల ప్రకారం వీసా కావల్సిన వారు స్వయం గా కార్యాలయానికి వచ్చి వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. కాని ఇమాన్ ది ఎటూ కదలలేని పరిస్థితి.

500-kg-egyptian-woman

ఇక చేసేదేమి లేక వారు మరియు డాక్ట‌ర్‌ ముఫ‌జ్జ‌ల్ ల‌ఖ్‌డావాలా, ఇమాన్ పరిస్థితి గురించి ట్విట్టర్ లో సుష్మా స్వరాజ్ కు తెలియజేశారు. వారి ట్వీట్ కి స్పందించిన విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ వెంటనే ఇమాన్ కు మెడికల్ వీసా ఇచ్చే ఎర్పాట్లు చేయాలని ఈజిప్ట్ లోని భారత రాయబార కార్యాలయాన్ని అదేశించారు. మంత్రి చొరవతో 20 గంటలలోనే ఇమాన్ కు మెడికల్ వీసా లభించింది. దానితో అందరూ మంత్రి పనితనాన్ని మెచ్చుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఇమాన్ ని తొందరలోనే ప్రత్యేక విమానంలో ముంబాయి కి తీసుకురానున్నారు.

(Visited 1,265 times, 1 visits today)