Home / Inspiring Stories / Video: 6 వ త‌ర‌గ‌తి పిల్లాడు…సొంతంగా ATM ని తయారు చేశాడు.!

Video: 6 వ త‌ర‌గ‌తి పిల్లాడు…సొంతంగా ATM ని తయారు చేశాడు.!

Author:

కొత్త కొత్త ఐడియాలు చాలామందికి వస్తుంటాయి కానీ పరిస్థితులకి తలొగ్గకుండా తన ఆలోచనలని, సృజనాత్మకతని నమ్ముకొని ఆ దిశగా ప్రయత్నం చేసినవారే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు, పిల్లలో చిన్నవయసులోనే వారిలో ఉండే కొత్త కొత్త ఆలోచనలకూ, సృజనాత్మకతను గుర్తించి తగిన ప్రోత్సాహం ఇస్తే భవిష్యత్ లో సమాజానికి అవసరపడే ఆవిష్కరణలు చేయగలుగుతారు కానీ ప్రస్తుతం పిల్లలకి ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా స్కూల్ అని, మార్కులు అని, ర్యాంకులు అని..వారికి ఒక రకమైన ఒత్తిడికి గురిచేస్తూ వారిలో ఉండే ఆలోచనలని, సృజనాత్మకతని చంపివేస్తున్నాం ఎంతసేపు క్లాస్ ఫస్టా..స్కూల్ ఫస్టా అని మార్కుల ఆధారితంగానే పిల్లల మేధస్సుని అంచనా వేసే పరిస్థితిలో ఉన్నాం..పిల్లల ఇష్టా ఇష్టాలకు అనుగునంగా కాకుండా తల్లిదండ్రుల ఇష్టా ఇష్టాలకు అనుగుణంగా చదువులు చదివిస్తున్నాం…కానీ పిల్లల అభిరుచికి ప్రాధాన్యం ఇస్తే గొప్ప గొప్ప సైంటిస్టులు ,క్రీడాకారులు మన మధ్య నుండే పుడతారు..దానికి ఉదాహరణే… ఆరోతరగతి చదివే కుర్రాడు సృష్టించిన పేపర్ ఏటీఎం.

మన చిన్నప్పుడు జాతరలోనే లేదంటే ఎక్కడికైనా వెళ్తే కొనుక్కొచ్చుకున్నబొమ్మల్ని మొత్తం ఏ పార్ట్ కి ఆ పార్ట్ పీకేసి అది ఎలా పనిచేస్తుంది అని ఒక చిన్నపాటి పరిశోదనే చేసేవాళ్లం. పాడైపోయిన బల్బ్ లలో ఫిలమెంట్ లు ఎలా ఉంటాయో చూడటం. మట్టితో చిన్న కాలువలు కట్టి , నీళ్లతో ఆడుకునేవాళ్ళం, అంతెందుకు సినిమాల్లో, అడ్వర్టైజ్ మెంట్లలో చూపించినట్టు ధర్మామీటర్ వేడి పాలల్లో పెడితే రీడింగ్ మారదు.సరికదా పేలిపోతుందని..అందులో దొరికిన పాద రసన్ని పట్టుకొనే ప్రయత్నం చేస్తే బంగారం ఉంగరంలో బంగారమే మిగలదని ప్రయోగాత్మక పరిశీలనతో తెలుసుకున్న ది మన చిన్నప్పుడే కదా..గురివింద గింజ పుట్టుక, పాల పలకపుల్ల తయారీ ప్రక్రియ, చెట్ల నుంచి బంక తీయటం ఎలా , ఇలాంటి ఎన్నో ప్రయోగాలు, నేతిబీరకాయలో నెయ్యి ఉండదని తెలుసు. కానీ ఇంకేముంటుందో తెలుసుకొని ప్రపంచానికి తెలియ చెప్పాలనే ఆతృత..కానీ ఇప్పుడు చిన్నారుల్లో ఇంత ఆతృత కానీ,ఉత్సాహం కానీ మనం చూస్తున్నామా..ఎక్కడైనా ఒకరిద్దరు కనిపిస్తే మనకు వాళ్లే మహా మేధావుల్లా కనపడతారు..అలాంటి వాడే హరీశ్..

ఇటివల మనం ఎక్కువ గా ఇబ్బందులు పడిన విషయం ఏమన్నా ఉందా అంటే డబ్బు గురించి..నోట్ల రద్దుతో ఎటిఎంల చుట్టు ప్రదక్షిణలు చేస్తునే ఉన్నాం..ఇప్పటికీ మన నోట్ల కష్టాలు తీరలేదు..ఇలాంటి కష్టాన్నే వాళ్ల అమ్మానాన్న పడడం కూడా దగ్గరుండి చూసాడోమో హరీశ్..ఏకంగా పేపర్ ఎటిఎం తయారు చేసాడు..దానికోసం అతడు వాడుకున్నది చిన్న అట్టపెట్టె,చిన్న చిన్న వైరుముక్కలు. మరికొన్ని చిన్న చిన్న పరికరాలు, తను చేసిన పేపర్ ఏటీఎం మాములు ఏటీఎం లాగ పనిచేయకపోవచ్చు కానీ ఇంత చిన్న వయసులోనే నమూనా ఏటీఎం తయారుచేయగలిగాడు అంటే తగిన ప్రోత్సాహం లభిస్తే భవిష్యత్ లో పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేయగలడు, పిల్లల ఆలోచనలకు విలువిస్తే వారికి నచ్చిన రంగంలో వారి సృజనాత్మకతను చాటుకుంటారని హరీశ్ చిన్న ఎగ్జాంపుల్..ఇప్పటికైనా పిల్లల ఆలోచనలకు విలువిచ్చి వారిలోని సృజనాత్మకతకు తగ్గట్లు ప్రోత్సహించండి.

Dear friends 6th class student Harish done mini ATM with papers

Posted by Sardar Shaik D on Saturday, 2 September 2017

(Visited 421 times, 1 visits today)