Home / Latest Alajadi / ఉబెర్ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో 7కోట్లు

ఉబెర్ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో 7కోట్లు

Author:

హైదరాబాద్ లో ఉబెర్ కారు నడిపే డ్రైవర్ బ్యాంకు అకౌంటులో 7 కోట్ల రూపాయలు జమ అవటం అధికారులు గుర్తించారు. ఉబెర్ క్యాబ్ డ్రైవర్ స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ ఖాతాలో ఇంత మొత్తంలో జమ అవటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అత్యధిక మొత్తంలో జమ అయినా బ్యాంకు ఖాతాలపై హైదరాబాద్ ఐటీ అధికారులు ఓ కన్నేసి ఉంచారు. అంతా పెద్ద మొత్తంలో ఉన్న డబ్బు పాత 500, 1000 రూపాయల నోట్ల ద్వారా జమ చేసినట్లు గుర్తించారు.

7crs in cab driver account

ఐటీ అధికారులు క్యాబ్ డ్రైవర్ ని అంత డబ్బు ఎలా వచ్చింది? దానిని బులియన్ ట్రేడర్ ఖాతాలోకి ఎందుకు మళ్లించారు అని ఆరా తీయగా… సరైన జవాబు చెప్పకపోవడంతో, బ్యాంకు లోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తనిఖీ చేశారు. డబ్బు డిపాజిట్ చేసిన సమయంలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆ ఇద్దరి వ్యక్తులను కూడా ఐటీ అధికారులు పట్టుకుని విచారణ చేస్తున్నారు.

(Visited 465 times, 1 visits today)