Home / Inspiring Stories / మంచిపని కోసం 17 ఏళ్లుగా టపాసులని కాల్చడం నిషేధించుకున్న 8 గ్రామాల ప్రజలు.

మంచిపని కోసం 17 ఏళ్లుగా టపాసులని కాల్చడం నిషేధించుకున్న 8 గ్రామాల ప్రజలు.

Author:

దీపావళి వచ్చిందంటే చాలు.. ఆ పండుగ చుట్టూ మూడు రోజులు వీధులన్ని టపాసుల మోతతో దద్దరిల్లుతాయి. దేశమంతా ఇదే సందడి కాని తమిళనాడులోని ఎనిమిది గ్రామాలు మాత్రం ఒక మంచి పని కోసం టపాసులు కాల్చడం నిషేదించాయి. 17 సంవత్సరాల ముందు వరకు అందరిలాగే టపాసుల దీపావళి జరుపుకున్న వారు ఎందుకు టపాసులను నిషేదించారో తెలిస్తే మీరు ఆ గ్రామస్తులను అభినందించక మానరు. ప్రకృతి ని మరియు అంతరించిపోతున్న పక్షి జాతులను కాపాడటం కోరకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

for-the-last-17-years-the-villagers-of-these-eight-villages-have-not-burn-crackers-for-a-cause

తమిళనాడు లోని ఈరోడ్ జిల్లలోని ఎనిమిది గ్రామల సరిహద్దుల్లోని సరస్సులో 17 సంవత్సరాల క్రితం వెల్లొడె పక్షి సంరక్షణ కేంద్రంను స్థాపించారు. 200 ఎకరాలలో ఉన్న ఈ సంరక్షణ కేంద్రం కు దేశ, విదేశాల నుండి వివిద రకాల పక్షులు వలస వస్తాయి. ప్రతి సంవత్సరం అలా వచ్చిన పక్షులు ఆక్టోబర్ నుండి మార్చి వరకు ఆ సంరక్షణ కేంద్రంలోనే గూడు ఏర్పాటు చేసుకొని తమ సంతానాన్ని పెంచుకుంటాయి. ఈ పక్షుల పట్ల మక్కువ పెంచుకున్న ఆ సరిహద్దు ఎనిమిది గ్రామాల ప్రజలు పక్షులను భయపెట్టే అన్ని పనులను నిషేదించారు. టపాసుల పేల్చడం వలన కలిగే శబ్దానికి పక్షులు భయపడతాయని, మరియు టపాసుల వలన కలిగే కాలుష్యం పక్షులకు మంచిది కాదని తెలుసుకొని దీపావళికి టపాసులు కాల్చడం మానేసారు. అంతే కాకుండా ఆ గ్రామాల ప్రజలు ఎవరూ ఆ పక్షులను వేటాడకూడదని నిర్ణయించుకున్నారు. దానితో ప్రతి సంవత్సరం పక్షుల రాక పెరిగి ఇప్పుడు ఆ ప్రాంతం ఒక మంచి సందర్శాత్మక ప్రాంతం అయ్యింది. ప్రకృతి ని, పక్షులను ప్రేమిస్తున్న ఆ గ్రామస్తులను మనం తప్పకుండా అభినందించాల్సిందే.

(Visited 384 times, 1 visits today)