Home / Inspiring Stories / కాకుల నుండి బహుమతులు పోందుతున్న బాలిక

కాకుల నుండి బహుమతులు పోందుతున్న బాలిక

Author:
Crows5
పక్షులు అంటే అందరికి ఇష్టమే, చాలా దేశాలలో ప్రజలు పక్షుల కోసం తమ ఇళ్లల్లో, గార్డెన్లలో గింజలను చల్లుతూ ఉంటారు. అమెరికాలోని సియటెల్ నగరంలో గాబీ అనే 8 ఏళ్ల అమ్మాయి రోజు గార్డెన్‌లో పక్షుల కోసం గింజలు వేస్తూ ఉండేది. అలా 4 సంవత్సరాల నుండి చేస్తూ చాలా పక్షులకి ఫ్రెండ్ అయ్యింది.కానీ కొన్ని రోజులుగా ఆమె వేసిన ఆహారం తిన్న కాకులు ఏదో ఒక వస్తువుని ఆమె గార్డెన్‌లో పడవేయడం మొదలుపెట్టాయి. ముందుగా ఏదో అలా మర్చిపోయి వేస్తున్నాయి అనుకుంటే, ఆ వస్తువుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.
Crows1
కాకులు ప్రతి రోజు గాబీ వేసిన ఆహారం తినడం, తమకు దొరికిన ఏదో ఒక వస్తువును తెచ్చి ఇవ్వడం ఇంకా జరుగుతూనే ఉంది. గాబీ కూడా కాకులు ఇచ్చిన వస్తువులని పడవేయకుండా జాగ్రతగా దాచుకుంటుంది. ఇలా కాకులు తెచ్చిన బహుమతులలో నట్టులు, బోల్ట్లు, ప్లాస్టిక్ పదార్దాలు, చిన్న చిన్న బొమ్మలు, పేపర్ క్లిప్లు, ముత్యాలు ఇంకా చాలా ఉన్నాయంట.  కాకులు తెలివి కల పక్షులే కాదు విశ్వాసం చూపిస్తాయన్న దానికి ఇది ఒక ఉధహరణ.
Crows3
(Visited 303 times, 1 visits today)