Home / Inspiring Stories / గౌరవనీయులైన ప్రధాని మోడీ..! ఇలా ఐతే నాచదువెలా సాగుతుందీ?

గౌరవనీయులైన ప్రధాని మోడీ..! ఇలా ఐతే నాచదువెలా సాగుతుందీ?

Author:

8-Year-Old Writes To PMO Explaining How An Incomplete Flyover Was Coming In The Way Of His Studies!

మా ఇంటి నుంచి యశ్వంతపురలోని స్కూలుకు వెళ్లటానికి మూడు కిలో మీటర్లు దూరం మాత్రమే. రహదారి మధ్యలో ఫ్లైఓవర్ల నిర్మాణం.. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద జరుపుతున్న నిర్మాణ పనుల్లో  జాప్యం కారణంగా మూడు కిలోమీటర్ల దూరానికి 45 నిమిషాల సమయం పడుతోంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా నేను బాదలు పడాలి నాకు స్కూలుకు వెళ్ళటం చాలా ఆలస్యం అవుతోంది అంతేకాదు ధీర్ఘ కాలం గా జరుగుతున్న పనుల వల్ల ఇక్కడ ఉండే ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది మీరు చర్య తీసుకోవచ్చును కదా అంటూ మోడీ ఆఫీస్ కి ప్రధాని పేరు మీద ఒక ఈ మెయిల్ వచ్చింది. రాజస్థాన్‌లో హోంగార్డుల సంఘం  హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానికి వివరించాలన్న ఉద్దేశ్యంతో రక్తం తో రాసిన వార్త ఇంకా మరిచి పోక ముందే ప్రధాని కార్యాలయానికి వచ్చిన ఈ లేఖ కార్యాలయ ఉద్యోగులకు చిన్న షాక్ ఇచ్చింది. స్వయంగా ఈ ఈ-మెయిల్ చూసిన మోడీ వెంటనే ఆ పనుల విశయం లో జాప్యం జరగరాదని సంబందిత అధికారులకు ఆదేశాలివ్వటమే కాదు. ఆ లేఖ కి జవాబు కూడా పంపారట..

తాను రోజూ స్కూలుకు వెళ్ళటానికే కాదు రహదారి మధ్యలో జరుగుతున్న ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు జాప్యం అవటం వల్ల ఎదురవుతున్న అన్ని రకాల సమస్యలనూ తనకి తెలిసిన భాషలో నే మోడీ కి ఉత్తరాన్ని పంపంచాడు బెంగుళూరుకు చెందిన ఒక విధ్యార్తి. విధ్యార్థి అనగానే ఏ కాలేజ్? అనుకుంటున్నారా కాలేజ్ కాదు స్కూల్ అదీ ప్రైమరీ స్కూల్ చదివేది మూడో తరగతి. వయస్సు 8 ఏళ్ళు, పేరు “అభినవ్”. రోజూ స్కూల్ కి వెళ్ళెటప్పుడు తాను ఎదుర్కుంటున్న, చూసిన సమస్యలని దేశ ప్రధానికి అందేలా చేయగలిగిన ఆకుర్రవాడి ఆలోచనా శక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా అభినవ్ గురించే మాట్లాడుకునేలా చేసింది. నిజానికి అభినవ్ చేసింది చిన్న పనేమీ కాదు. ప్రజా స్వామ్య దేశాలలో ఉండే పౌరాధికారాన్ని వాడుకున్నాడు,ప్రజా ప్రతినిధే అయిన ప్రధానికి సమస్యని చెప్పి,ఎప్పుడు పరిష్కరిస్తారు అని తన ప్రశ్నించే హక్కుని అభినవ్ చక్కగా వాడి మనకు చూపించాడు కూడా….

(Visited 1,465 times, 1 visits today)