Home / Entertainment / 900 థియెటర్లలో పేలనున్న డైనమెట్

900 థియెటర్లలో పేలనున్న డైనమెట్

Author:

మంచు విష్ణు హీరో గా దేవా కట్టా దర్శకత్వం లో తెరకెక్కిన డైనమెట్ రేపు రిలీజ్ అవనుంది.ఇప్పటికే పోస్టర్లతో, టీజర్ తోను  ఆసక్తిని పెంచిన ఈ సినిమా తెరపై తన సత్తా చూపించేందుకు సిద్దమైంది. “ప్రస్తానం, ఆటోనగర్ సూర్యా లాంటి చిత్రాల తో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవా కట్టా ఈ డైన మెట్ పేలుడు చిత్ర పరిశ్రమలోనే ఒక సంచలం ఔతుందని చెప్పిన నేపథ్యం లో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయ్. సరికొత్త లుక్ తో కనిపిస్తున్న మంచు విష్ణు ఈ సారి హిట్ ఖాయం అన్న కాన్ ఫిడెన్స్ తో ఉన్నారు. రిలీజ్ చేయటానికి అన్ని సన్నాహాలూ పూర్తయ్యాయనీ. మొత్తం 900 థియేటర్లలో విడుదల చేయనున్నామనీ దేవా కట్టా చెప్తున్నారు. ఒక్క నైజాం లోనే 200 థియేటర్లలో విడుదల చేయనున్నారట.

డైనమెట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోవచ్చని ట్రైలర్లలో యాక్షన్ సన్నివేశాలని బట్టి తెలుస్తోంది.ఈసారి మంచు విష్ణు తన గత చిత్రాలకంటే భిన్నమైన కథని ఎంచుకున్నాడు. యక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకునేందుకు ఫైట్స్, బాడీ లాంగ్వేజ్ పై దృష్టి పెట్టాడు. మొత్తంగా ఒక డిఫరెంట్ లుక్ లోకి వచ్చాడు. మంచు విష్ణు కి  ఈ డైనమెట్ మంచి బూస్ట్ ఇవ్వొచ్చనే అనుకుంటున్నారు సినీ జనాలు. రిలీజ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు మంచు అభిమానులు. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేక మళ్ళీ మంచు విష్ణు కి నిరాశనే మిగులుస్తుందా అన్నది ఇంకో రెండు రోజుల్లో తేలనుంది. బెస్ట్ ఆఫ్ లక్ టు మంచు విష్ణు అంద్ డైనమెట్ టీం

(Visited 34 times, 1 visits today)