Home / Inspiring Stories / ఈ 91 ఏళ్ళ డాక్టర్ 1948 నుండి ఉచిత వైద్యం చేస్తూ చిన్న పిల్లల ప్రాణాలు కాపాడుతుంది.

ఈ 91 ఏళ్ళ డాక్టర్ 1948 నుండి ఉచిత వైద్యం చేస్తూ చిన్న పిల్లల ప్రాణాలు కాపాడుతుంది.

Author:

డాక్టర్.భక్తి యాదవ్ ఇండోర్ పట్టణం లో ఒక గైనకాలజిస్ట్. ప్రతీరోజూ తన దగ్గరికి వచ్చే గర్భవతులైన మహిళలకు వైద్యం చేస్తూంటారు. ఇందులో వింతేముందీ..? అంటారా. భారత దేశం లోనే మొదటి మహిళా MBBS ఈవిడ.. అదే వింత అనుకోకండి. ముందు ఇంకో విషయం ఉంది. ఇప్పుడామె వయస్సు 91 సంవత్సరాలు. 1948 నుంచీ ఆమె వైధ్య సేవలు అందిస్తూనే ఉన్నారు ఇప్పటివరకూ తన చేతుల మీదుగా కొన్ని వందల మంది శిశువులని ఈ ప్రపంచం లోకి తెచ్చారు…. ఇక ఇప్పుడు ఇక్కడ మీకు ఈమె గురించి చెప్పాల్సిన విషయం ఒకటుంది ఈమె వైద్యం చేయటానికి ఫీజు వసూలు చేయరు…. ఔను..! ఈ 91ఏళ్ళ డాక్టర్ డబ్బు కోసం పని చేయటం లేదు,అందరికి ఉచిత వైద్యం దక్కాలనే లక్ష్యంతో పని చేస్తుంది.

91-years-old-and-first-female-mbbs

ఈ కాలంలో చిన్న దెబ్బ తగిలింది అనో, దగ్గు లేస్తుంది అనో హాస్పిటల్ కి వెళ్తే ఆ స్కానింగ్, ఈ స్కానింగ్ అని వేల నుండి లక్షల వరకు సామాన్య ప్రజల డబ్బులని దోచేస్తారు, కాని ఈ 91 ఏళ్ల భక్తియాదవ్ 68 ఏళ్ల నుండి డబ్బులకు ఆశపడకుండా ఈ వయసులోనూ ప్రతి రోజు హాస్పిటల్ కి వచ్చి  ఉచిత వైద్యం చేస్తుంది, ఈ తరం వైద్యులందరూ భక్తియాదవ్ లాగ ఉచిత వైద్యం చేయకపోయినా పర్లేదు కాని, స్కానింగ్ ల పేరిట ప్రజల జీవితాలతో ఆడుకోకపోతే చాలు.

 

(Visited 1,381 times, 1 visits today)