Home / Political / బ్రెగ్జిట్ తో గ్రేట్ బ్రిటన్ కుప్పకూలనుందా?

బ్రెగ్జిట్ తో గ్రేట్ బ్రిటన్ కుప్పకూలనుందా?

Author:

ఫలితం తేలింది, ఇన్నాళ్లుగా యురోపియన్ యూనియన్లో భాగంగా ఉన్న గ్రేట్ బ్రిటన్ ను ఆ యూనియన్ నుంచి బయటకు రావాలంటు ప్రజలు తీర్పు చెప్పారు.బ్రెగ్జిట్‌ పై నిన్న జరిగిన రెఫరెండంలో 52% మంది గ్రేట్ బ్రిటన్ ప్రజలు ఈయు నుండి బయటకు రావాలంటు ఓటు వేశారు. లండన్, స్కాట్లాండ్, నార్దర్న్ ఐర్లాండ్ ప్రదేశాలలోని ప్రజలు యురోపియన్ యూనియన్ కి మద్దతుగా వోటు వేస్తే, మిగిలిన అన్ని ప్రాంతాల వారు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావాలని వోటు వేశారు. ఈ పరిణామంతో అన్ని యురోపియన్ దేశాలు ఖంగు తిన్నాయి. యురోపియన్ యూనియన్ కి మద్దతుగా ఉన్న బ్రిటన్ ప్రధాని కెమరూన్ తన పదవికి రాజీనామా చేస్తునట్లు ప్రకటించాడు.

Great Britain will fall down

ఇన్నాళ్లు యురోపియన్ యూనియన్ లో భాగంగా, అన్ని దేశాలతో కలిసి పనిచేసిన గ్రేట్ బ్రిటన్, యురోప్ నుండి విడిపోనుందని తెలియగానే ప్రపంచ మార్కెట్లు తిరోగమనంలో పడ్డాయి. గ్రేట్ బ్రిటన్ కరెన్సీ అయిన పౌండ్ విలువ 30 సంవత్సరాల దిగువకు పడిపోయింది. కలిసి ఉంటే కలదు సుఖం అని అప్పట్లో స్కాట్లాండ్, గ్రేట్ బ్రిటన్ నుండి విడిపోవాలనుకున్నపుడు చెప్పిన బ్రిటన్ ప్రజలు ఇప్పుడు మాత్రం విడిపోయి బాగుపడదాం అని రాగం పాడారు. కానీ విడిపోతే ఆర్ధికంగా బ్రిటన్ కే నష్టం అని చాలా ఆర్ధిక సంస్థలు వెల్లడించాయి. కొంతమంది అది నిజం కాబోతుంది అని వాదిస్తున్నారు. ఇప్పుడు నాలుగు దేశాలుగా కలిసి ఉన్న గ్రేట్ బ్రిటన్ నుండి స్కాట్లాండ్, నార్దర్న్ ఐర్లాండ్ దేశాలు విడిపోయిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అదే గాని జరిగితే ఆర్ధిక శక్తిగా ఉన్న గ్రేట్ బ్రిటన్ పతనం మొదలైనట్లే. అసలు యురోప్ లో ఎం జరగబోతుందో కొన్ని రోజుల్లోనే తెలిసిపోనుంది.

(Visited 681 times, 1 visits today)