పడవకు కెప్టెన్ ఎంత ముఖ్యమో సినిమాకు దర్శకుడు అంత ముఖ్యం కానీ మన తెలుగు సినిమాలలో సినిమా హిట్ అయితే హీరోకి దండ వేస్తారు కానీ సినిమా ఫట్ అయితే మాత్రం దర్శకుడుని భాద్యున్ని చెస్తారు. ఇలాంటి కోవ నుండి తెలుగు ప్రేక్షకులను బయటకు తీసుకు రావడానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న దర్శకులలో త్రివిక్రం ముందుంటాడు. కేవలం తన మార్కు కథ, దర్శకత్వంతో అఆ సినిమాను చాల మంది హీరోలకు ఇంకా సాద్యం కాని 50 కోట్ల క్లబ్ లో చేర్చాడు. నితిన్, సమంత హీరో, హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమా మంచి కుటుంబ చిత్రంగా నిలిచి 50 కోట్లకు పైగా వసూళ్ళు సాదించింది.
విడుదల అయిన రోజు నుండి మంచి కలెక్షన్లతొ దూసుకుపొయిన ఈ సినిమా విదేశాలలో ఉన్న తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. దీనితో ఈ సినిమా విదేశాలలో 16 కోట్లకు పైగా కలెక్షన్లు సంపాదించింది. హీరో నితిన్ ఈ సినిమాతో 50 కోట్ల క్లబ్ లో స్థానం సాధించాడు. మంచి మంచి సన్నివేశాలు, మాటలు ఉన్న ఇలాంటి సినిమాలతో, హీరోతో పాటు దర్శకులకు సమాన గౌరవం దక్కుతుంది. త్రివిక్రం గారు ఇలాంటి సినిమాలు మరిన్ని తీయలని కోరుకుందాం.
Must read: ఇది తాగితే 15 రోజులలో బలహీనంగా ఉన్న మీ ఎముకలు బలంగా అవుతాయి.