Home / Political / ఇక ముందు సినిమాలకు కట్టింగులు ఉండవు.

ఇక ముందు సినిమాలకు కట్టింగులు ఉండవు.

Author:

చాలా రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలకు, సెన్సారు బోర్డు కి మధ్య గొడవలు జరగడం అవి కోర్టుల దాక వెల్లడం చూస్తూనే ఉన్నాం. మంచి మంచి సన్నివేషాలను కట్ చేసారంటూ చెప్పె మాటలు ఇక మీదట వినపడకపోవచ్చు. దర్శకుల మరియు నటీనటుల ప్రతిభను సెన్సారు బోర్డు ఇక ఇప్పటినుండి ఏమి చేయలేదు. ఎప్పటి నుండో సమస్యగా ఉన్న సినిమాటోగ్రఫీ చట్టానికి భారత ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించింది. ఉడ్తా పంజాబ్ సినిమా గొడవతో ఈ విషయంలో కోర్టు జొక్యం చెసుకొని అసలు సెన్సారు బొర్డు కి సినిమాను కట్ చేసే అధికారం లేదని కేవలం సినిమా చూసి ఆ సినిమా ఏ కేటగిరి క్రిందకు వస్తుందో సర్టిఫికెట్ ఇచ్చే అధికారం మాత్రమే ఉందని చెప్పింది. దానితో కేంద్ర ప్రభుత్వం కూడ కోర్టు తీర్పుకు అనుగునంగా క్రింది మార్పులు ప్రకటించింది.

Censor Board

1. సెన్సార్ బోర్డు సభ్యులుగా మనస్తత్వవేత్తలు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ నుండి ఒక్కొక్కరు నియమించబడతారు.
2. ప్రతి సినిమా U12+,  U15+, A మరియు A+ (విపరీతమైన హింస మరియు లైంగిక సన్నివేశాలకు) కేటగిరిలలో ఎదో ఒక కేటగిరి సర్టిఫికెట్ ఇస్తారు.
3. పర్యవేక్షణ కమిటీ ఒక రోజులో రెండు కంటే ఎక్కువ సినిమాలకు సర్టిఫికెట్ ఇవ్వదు.
4. అత్యవసర క్లియరెన్స్ కోసం ‘తత్కాల్’ మార్గంలో ఎక్కువ డబ్బు కట్టి సెన్సార్ సర్టిఫికెట్ పొందవచ్చు .
5. సెన్సారు ద్వార వచ్చె ఆదాయాన్ని సినిమా కార్మికుల సంక్షేమానికి వాడుతారు.

ఒకసారి పార్లమెంట్ లో ఈ సవరణలు ఆమోదం పొందితే ఇక పరిశ్రమ వర్గాల వారికి సెన్సారు కష్టాలు తొలిగినట్లే.

(Visited 69 times, 1 visits today)