‘జనతా గ్యారేజ్ – ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును” అనే టైటిల్ పెట్టగానే టాలీవుడ్ రికార్డులకి ఎన్టీఆర్ రిపేర్లు చేస్తారని అందరు అనుకున్నారు, అలా అందరు ఊహించినట్టుగానే జనతా గ్యారేజ్ విడుదలకి ముందు నుండే పాత రికార్డులకు రిపేర్లు చేస్తూ కొత్త కొత్త రికార్డులని సృష్టించింది, నిన్న విడుదల అయిన జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్ లోనే పెద్ద సినిమాగా విడుదలై రికార్డు క్రియేట్ చేసింది, యుఎస్ఎ లో ప్రీమియర్ల తోనే హాఫ్ మిలియన్ మార్క్ కి చేరుకొని కొత్త రికార్డుని సృష్టించింది.
టాలీవుడ్ హీరో స్టామినాని చూపించే ఫస్ట్ డే కలెక్షన్స్ లోనే ఎన్టీఆర్ అదరగొట్టాడు, మొదటి రోజు 20 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి సరికొత్త రికార్డుని సృష్టించాడు, ఇప్పటివరకు ఫస్ట్ డే 20 కోట్లకి పైన వసూలు చేసిన బాహుబలి(22.4 Cr ) , సర్దార్ గబ్బర్ సింగ్ (20.92Cr) తరువాతి స్థానంలో నిలిచాడు, ఇప్పటి వరకు అందిన రిపోర్ట్ ల ప్రకారం జనతా గ్యారేజ్ 20.49Cr మొదటి రోజు వసూలు చేసింది, ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ డే.
AP and TS First Day Total Collections: 20.49 Cr
USA First Day Collections : 3.76 Cr
Janatha Garage First Day Total Collections: Rs. 24.25 Cr
Must Read: జనతా గ్యారేజ్ రివ్యూ & రేటింగ్.