Home / Inspiring Stories / పాక్ లో మెరుపు దాడి చేసి 38 మంది ఉగ్రవాదులని హతమార్చిన ఇండియన్ ఆర్మీ.

పాక్ లో మెరుపు దాడి చేసి 38 మంది ఉగ్రవాదులని హతమార్చిన ఇండియన్ ఆర్మీ.

Author:

యూరి సెక్టార్ లో ఉన్న సైనిక శిబిరంపై పాక్ సైన్యం సహకారంతో దాడి చేసి 20 మంది సైనిక వీరుల చావుకి కారణం అయిన ఉగ్రవాదులపై మన సైన్యం యుద్దాన్ని ప్రకటించింది, యూరి ఘటన జరిగినప్పుడే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం అని ప్రకటించిన సైన్యం ఇప్పుడు మాట నిలబెట్టుకుంది.

నిన్న అర్ధరాత్రి దాటినా తరువాత ఆర్మీలో అత్యుత్తమ కమాండో విభాగం పాక్ నియంత్రణ రేఖని దాటి 3 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్లి అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసారు, ఈ దాడిలో దాదాపు 38 మంది ఉగ్రవాదులని చనిపోయినట్లు మన సైన్యం ప్రకటించింది, ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ మీడియా ముందుకు వచ్చేశారు. నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉగ్రవాద స్థావనరాలపై దాడులు చేస్తున్నామన్న విషయాన్నిఅధికారికంగా చెప్పేశారు. తాము చేస్తున్న దాడుల వివరాల్ని పాక్ కు చెప్పినట్లుగా ఆయన వెల్లడించారు. సరిహద్దుల్లో పాక్ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. కాల్పుల్లో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మెరుపు దాడి చేసిన కమాండోలు.

నియంత్రణ రేఖ వద్ద బుధవారం రాత్రి దాడులు నిర్వహించామని.. వారికిదో గుణపాఠంగా ఆయన అభివర్ణించారు. ‘‘నియంత్రణ రేఖ వెంట ఉన్న ఉగ్రవాదుల లాంచ్ పాడ్లపై భారత సైన్యం నిన్నరాత్రి సునిశిత దాడులు చేసింది. ఈ దాడిలో భారత సైన్యం నుంచి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. మన భూభాగంలోకి చొరబడాలని కుట్రపన్నుతున్న ఉగ్రవాదులను మట్టికరిపించటమే ఈ దాడుల ఉద్దేశం’’ అని రణబీర్ సింగ్ మీడియాతో చెప్పారు. భారత సైన్యం దాడులపై దేశంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

(Visited 5,649 times, 1 visits today)