అందరికి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ డిసెంబర్ 31 న మొదలవుతాయి కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఈరోజు నుండే మొదలయ్యాయి, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కాటమరాయుడు సినిమా పై చాలా అంచనాలే నెలకొన్నాయి, దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు ఒక పోస్టర్ ని విడుదల చేసారు,ఈరోజు నుండి డిసెంబర్ 31 వరకు ప్రతిరోజూ ఒక సూపర్బ్ పోస్టర్ ని విడుదల చేస్తాం అని కాటమరాయుడు టీమ్ ప్రకటించింది.
పవన్ కళ్యాణ్ పంచెని ఒక చేతితో పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్న పోస్టర్ ని విడుదల చేసారు, కానీ ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ని కాళ్ళ నుండి నడుం వరకు మాత్రమే చూపించారు, అసలైన రాయలసీమ పంచె కట్టుతో పవన్ కళ్యాణ్ లుక్ ఉండబోతుంది ఈ పోస్టర్ తో మనం అర్థం చేసుకోవచ్చు, రోజుకొక పోస్టర్ చొప్పున విడుదల చేసి న్యూ ఇయర్ రోజు కాటమరాయుడు టీజర్ ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈరోజు నుండి న్యూ ఇయర్ వరకు రోజుకొక కొత్త పోస్టర్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు.