Home / Latest Alajadi / ఈ ఏడాది ఐపీల్ వేలంలో పాల్గొనబోతున్న క్రికెటర్స్ వీరే…

ఈ ఏడాది ఐపీల్ వేలంలో పాల్గొనబోతున్న క్రికెటర్స్ వీరే…

Author:

క్రికెట్ ప్రేమికులను దాదాపు రెండు నెలల పాటు అలరించే ఐపీల్ మరి కొన్ని రోజుల్లో మొదలవబోతుంది. ప్రతి ఏడాది వేసవిలో ఆరంభమయ్యే ఐపీల్ ప్రేక్షకులకి కావలసిన వినోదం, ఆటగాళ్లకు డబ్బుతో సహా కావాల్సినంత పేరు తెచ్చిపెడుతుంది. కేవలం ఐపీల్ లో రాణించి జాతీయ జట్టుకు ఎంపిక అయిన ఆటగాళ్లు చాలానే ఉన్నారు. ఒకవైపు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న వారికి ఐపీల్ మంచి వేదిక. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఆటగాళ్లు వేలంలో పాల్గొనబోతున్నారు. ఈ ఏడాది కూడా 2016లో పాల్గొన్న సన్ రైజర్స్ హైదరాబాద్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్… 8 జట్లు పాల్గొనబోతున్నాయి. ఇందుకు గాను జట్టు యొక్క ప్రాంచైజీలు కొందరు ఆటగాళ్లను వేలంలో అమ్మకానికి ఉంచారు.

ipl-auction-2017-date-time-and-players-list

మొదట వేలం ఫిబ్రవరి 4న ఉదయం 9 గంటలకు మొదలవనుందని ప్రకటించినప్పటికీ, ఈ వేలం ఫిబ్రవరి మూడవ వారానికి వాయిదా పడింది. ఈ వేలంలో పాల్గొనబోతున్న ప్రధాన ఆటగాళ్లు వీరే….
కెవిన్ పీటర్సన్-(రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్)
కోరీ అండర్సన్-(ముంబయి ఇండియన్స్)
ఇమ్రాన్ తాహిర్-(ఢిల్లీ డేర్ డెవిల్స్)
క్రిస్ జోర్డాన్-(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
మోర్నీ మోర్కెల్-(గుజరాత్ లయన్స్)
ఇయాన్ మోర్గాన్-(సన్ రైజర్స్ హైదరాబాద్)

(Visited 1,662 times, 1 visits today)